Share News

Minister Agani Satyaprasad : బీసీలకు అండగా టీడీపీ: మంత్రి అనగాని

ABN , Publish Date - Dec 15 , 2024 | 04:00 AM

అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రోత్సహించిందీ...

Minister Agani Satyaprasad : బీసీలకు అండగా టీడీపీ: మంత్రి అనగాని

  • ఘనంగా గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ గురుమూర్తి ప్రమాణం

విజయవాడ(పటమట), డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అన్న నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీలో మొదటి నుంచి బీసీలకు సముచిత స్థానం కల్పించిందని, సామాజిక ఆర్థిక రంగాల్లో ప్రోత్సహించిందీ టీడీపీయేనని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. రాష్ట్ర గౌడ క్రెడిట్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా వీరంకి గురుమూర్తి పదవీ ప్రమాణ స్వీకారం విజయవాడలో శనివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 30 సంవత్సరాల నుంచి గురుమూర్తి పార్టీకి అంకితభావంతో పనిచేశాడని, వైఎస్‌ జగన్మోహన్‌రె డ్డి హయాంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడి జైలుశిక్ష అనుభవించాడని, అతని పోరాట ఫలితమే ఈ పదవి అన్నారు. ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ బీసీలు అందరూ ఐక్యంగా మెలగాలని పిలుపునిచ్చారు. సమాచారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ గురుమూర్తి, తాను వేర్వేరు పార్టీల్లో ఉన్నా వ్యక్తిగతంగా సన్నిహితంగా మెలిగేవారిమని, గత 30 సంవత్సరాల నుంచి గురుమూర్తి టీడీపీ ఆలోచనలకు అనుగుణంగానే పనిచేశాడని ప్రశంసించారు. గురుమూర్తి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధత తో నిర్వహిస్తానని, రాష్ట్రంలో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 15 , 2024 | 04:00 AM