ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

MP Raghurama: సీఎం జగన్ కొత్త హెలికాఫ్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ ఫిర్యాదు

ABN, Publish Date - Feb 23 , 2024 | 12:19 PM

Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కొత్త హెలీకాప్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సీఈసీకి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని లేఖలో ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఎంపీ తెలిపారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) కొత్త హెలికాప్టర్లపై సీఈసీకి (CEC) ఎంపీ రఘురామ కృష్ణరాజు (MP Raghurama Krishnaraju) ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిలో (ABN Andhrajyothy) వచ్చిన కథనాన్ని సీఈసీకి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ఖర్చుతో ఈ విధంగా హెలికాప్టర్ల ఏర్పాటుపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఈసీని కోరారు. రెండు హెలికాప్టర్లకు నెలకు రూ.3.82 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.

వ్యక్తిగత భద్రత పేరుతో ఎన్నికల ప్రచారం చేసుకోవడానికే ఈ విధమైన ఏర్పాటు చేసుకున్నారన్నారు. ఎన్నికల ఖర్చు నుంచి తప్పించుకోవడానికే జగన్ ఈ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఈ హెలికాప్టర్లలోనే భారీగా నగదును తరలించేలా జగన్ యత్నించే అవకాశం ఉందని ఈసీకి తెలిపారు. జగన్ ప్రభుత్వ వ్యయంతో ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ హెలికాప్టర్ల వాడకాన్ని అడ్డుకోవాలని సీఈసీని ఎంపీ కోరారు. హెలికాప్టర్లను తనిఖీలు చేసేందుకు కూడా ప్రత్యేక పరిశీలకులను నియమించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు వినతి చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 23 , 2024 | 12:20 PM

Advertising
Advertising