ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ఎన్డీఏ కూటమికి ఎమ్మార్పీఎస్ మద్దుతు

ABN, Publish Date - Mar 18 , 2024 | 09:56 PM

ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, బీజేపీ జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు.

ప్రకాశం: ఏపీలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం తెలుగుదేశం, బీజేపీ జనసేనలతో కూడిన ఎన్డీఏ కూటమికి తాము మద్దతిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ (MRPS) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వంలో ఉమ్మడి దళితులకు అన్యాయం జరిగిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పారు. చంద్రబాబు హయాంలో మాదిగలకి మేలు జరిగిందని తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని అన్నారు. వైసీపీ పాలనలో విద్య, ఉద్యోగం, సంక్షేమం, రాజకీయంగా దళితులకి అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యకి జగన్ పేరు పెట్టడం దుర్మార్గమన్నారు. దళితుల చదువులకి జగన్ సొంత సొమ్ము చెల్లించడం లేదని... ప్రభుత్వ సొమ్మును వినియోగిస్తున్నారని చెప్పారు. విదేశీ విద్యకి జగన్ పేరు మంచిదేనని జూపూడి మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 10:30 PM

Advertising
Advertising