ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Payyavula Keshav: ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీ

ABN, Publish Date - Mar 23 , 2024 | 07:17 PM

ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు.

అమరావతి: ఎన్నికల్లో వైసీపీ(YSRCP) అక్రమాలకు పాల్పడుతోందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. సీఈఓ కార్యాలయంలో శనివారం నాడు ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనాకు వైసీపీ అక్రమాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. ఏపీలో ఎన్నికల ప్రచార సమయంలో వైసీపీ అక్రమ ఎత్తుగడలపై ఫిర్యాదు చేశానని చెప్పారు. టీడీపీ ఎన్నికల ప్రచార బృందాలపై వైసీపీ నేతలు ఏదో ఒక గొడవ పెట్టకొని ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాలని పోలీసులపై ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలన్నారు. పోలీసులు టీడీపీ సానుభూతి పరులను పిలిచి బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలింగ్ రోజున టీడీపీ నేతలు స్టేషన్‌లో ఉంచుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారని అన్నారు. తమ నేతల అడ్డంకి లేకుంటే పోలింగ్ రోజు వైసీపీ ఆగడాలకు అంతే ఉండదని చెప్పారు. వైసీపీ నాయకులపై ఉన్న రౌడీషీట్లను ఇప్పుడు తొలగించేస్తున్నారని అన్నారు. టీడీపీ సానుభూతి పరులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తున్నారని పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 23 , 2024 | 07:17 PM

Advertising
Advertising