మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Elections: వైసీపీకి కొత్త కష్టాలు.. కుట్రలకు బలికాబోమంటున్న జనం..!

ABN, Publish Date - Apr 23 , 2024 | 08:24 AM

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP)కి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయట. ప్రచారానికి, వైసీపీ సభలకు జనం నుంచి స్పందన అరకొరగా ఉందనే ప్రచారం జరగుుతోంది.

AP Elections: వైసీపీకి కొత్త కష్టాలు.. కుట్రలకు బలికాబోమంటున్న జనం..!
YS Jagan

ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే చాలా మంది ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ(YSRCP)కి కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయట. ప్రచారానికి, వైసీపీ సభలకు జనం నుంచి స్పందన అరకొరగా ఉందనే ప్రచారం జరగుుతోంది. విజయవాడలో సీఎం జగన్‌ (YS Jagan) పై రాయి దాడి ఘటన తర్వాత వైసీపీ ప్రచార సభలకు వెళ్లాలంటే జనం భయపడిపోతున్నారనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. తమను ఏ కుట్రలో ఎప్పుడు ఎలా ఇరికిస్తారోనని కొంతమంది భయపడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు రోజువారీ కూలీలను, స్థానిక మహిళలు, యువతను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటారు. ప్రచారానికి, ఎన్నికల సభలకు వెళ్లినందుకు కొంత కిరాయి చెల్లిస్తారు. దీంతో ఏ సభలో చూసినా, పెద్ద నాయకుల ప్రచారాల్లో జనం ఎక్కువుగా కనిపిస్తుంటారు. కానీ ఈ మధ్య రాష్ట్రంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలతో వైసీపీ సభలకు వెళ్లాలంటే కొంతమంది ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అవినీతి పార్టీకి ఓట్లు వేయొద్దు


నామినేషన్ ర్యాలీలపైనా ప్రభావం..

ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. సాధారణంగా నామినేషన్ల సమయంలో తమ బలం చూపించుకునేందుకు ప్రధాన పార్టీల నాయకులు భారీ ర్యాలీతో నామపత్రాలు సమర్పిస్తుంటారు. దీనిలో భాగంగా నియోజకవర్గం పరిధిలో భారీ జన సమీకరణకు పార్టీలు ప్లాన్ చేస్తాయి. ఈమధ్య కాలంలో వైసీపీ నాయకుల నామినేషన్ ర్యాలీల్లో పెద్దగా జనం కనిపించడం లేదు. అక్కడక్కడ మినహిస్తే మిగిలిన చోట్ల వైసీపీ ఆశించిన స్థాయిలో జనం రావడంలేదు. డబ్బులిస్తామంటున్నా వైసీపీ కార్యక్రమం అంటే ప్రజలు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రాయి దాడి తర్వాత జరిగిన పరిణామాలు, అంతకుముందు కోడి కత్తి కేసు గురించి తెలిసిన చాలామంది ఎన్నికలు పూర్తయ్యే వరకు వైసీపీ సభలకు దూరంగా ఉంటే బెటర్ అని భావిస్తున్నారట.


వాళ్లు మాత్రమే..!

వాస్తవానికి రాయి దాడి ఘటనతో సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరిగిందనే విషయం దుర్గారావు ద్వారా బయటకు వచ్చింది. దుర్గారావు గట్టిగా నిలబడటంతో చివరకు ఆయనను పోలీసులు వదిలేయాల్సి వచ్చింది. మరోవైపు ఎన్నికలు పూర్తయ్యేలోపు వైసీపీ ఇంకా ఎన్ని కుట్రలకు పాల్పడుతుందోననే భయం రాష్ట్ర ప్రజలను వెంటాడుతుందని విపక్షాలు ఇప్పటికే ఆరోపిస్తున్నాయి. వైసీపీ కుట్రలకు సామాన్యులు బలిపశువులు కావాల్సి వస్తో్ందనే విమర్శలు వైసీపీపై ఉన్నాయి. దీంతో వైసీపీ ప్రచారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారని, పార్టీలో ఉండి తప్పదనుకునేవాళ్లు మాత్రమే వైసీపీ ప్రచారానికి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

నా గెలుపు ఖాయం

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 23 , 2024 | 08:45 AM

Advertising
Advertising