ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena: నాగబాబు అందుకే సీటును వదులుకున్నారు.. పోతిన మహేష్ కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 08 , 2024 | 03:12 PM

జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: జనసేన యువనేత పోతిన వెంకట మహేష్ (Pothina venkata mahesh) సోమవారం నాడు ఆ పార్టీకి , పదవులకు రాజీనామా చేశారు. ఈ సమయంలో జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులో భాగంగా తమ పార్టీకి తీరని అన్యాయం చేశారని మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ కుట్రలో భాగంగా జనసేనను నాశనం చేశారని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు. సోమవారం నాడు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న సీట్లపై కాపులు ఎవరూ సంతృప్తిగా లేరని చెప్పారు. పొత్తులో భాగంగా 24సీట్లు తీసుకోవడం తమ పార్టీ నేతలకు ఎవరికి ఇష్టం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో కులాల మధ్య పవన్ కళ్యాణ్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు.


Janasena: జనసేనకు పోతిన వెంకట మహేష్ గుడ్‌బై.. పవన్‌పై ఘాటు విమర్శలు

బీసీలకు తీరని అన్యాయం

బీసీ సామాజిక వర్గం నుంచి నర్సాపురం అసెంబ్లీ సీటును బొమ్మిడి నాయకర్‌ ఒక్కరికే కేటాయించారన్నారు. మిగతా నేతలు ఏం పాపం చేశారని టికెట్లు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాపులు, బీసీల మధ్య చిచ్చు పెట్టేలా పవన్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. గతంలో భీమవరం నుంచి పవన్ పోటీ చేశారని.. మరి ఇప్పుడేందుకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు.

తన సీటును పిఠాపురానికి పవన్ ఎందుకు మార్చుకున్నారని నిలదీశారు. భీమవరంలో బలంగా లేని టీడీపీకి సీటు ఎందుకు కేటాయించారని అడిగారు. అక్కడ జనసేన కోసం పని‌చేసిన నేతలకు ఎవరికైనా సీటు కేటాయిస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. భీమవరంలో వైసీపీ నేతలు సొంత ఇల్లు కట్టుకోనివట్లేదని పవన్ చెప్పడం అబద్ధమని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.


ఆ టీడీపీ నేతకు ఏం చెప్పారు...

పిఠాపురం వెళ్లి తనను గెలిపించాలని టీడీపీ నేత వర్మను పవన్ కోరలేదా అని పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. సాయంత్రం తానే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నానని ఆ టీడీపీ నేతతో చెప్పించలేదా అని ఎద్దేవా చేశారు. జనసేన నేత నాగబాబుకు ఇచ్చిన అనకాపల్లి సీటును పవన్ ఎందుకు వదులుకున్నారని నిలదీశారు. ఆ సీటును ఎందుకు త్యాగం చేశారో పవన్ కళ్యాణ్ చెప్పాలని ప్రశ్నించారు.

ఆ ప్రాంతంలో కంపెనీల నుంచి డబ్బులు వసూల్ చేయలేదా అని నిలదీశారు. వారు ఫిర్యాదు చేశారనే ఆ సీటును నాగబాబు వదులుకున్నారని ఆరోపించారు. గతంలో నాగబాబుకు పవన్ కళ్యాణ్‌ దూరంగా ఉండలేదా అని ప్రశ్నించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అదే నాగబాబును వదిలేశారని పోతిన వెంకట మహేష్ మండిపడ్డారు.


AP Election 2024: ధర్మం వైపు నిలబడండి.. వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ వ్యక్తికి కీలక బాధ్యతలా..?

జనసేన పీఏసీ నేత నాదెండ్ల మనోహర్‌కు ఎన్నికల్లో భాగంగా పార్టీ నుంచి బస్సు కేటాయించలేదా అని నిలదీశారు. పవన్ చేతకాని తనం వల్ల తమలాంటి వాళ్లు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లల్లో జనసేనను చాలా జిల్లాలో ఎందుకు సంస్థగతంగా ప్రభావితం చేయలేకపోయారని నిలదీశారు.

మనోహర్ తన సొంత నియోజకవర్గంలోనే పార్టీని ప్రభావితం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. అలాంటి వ్యక్తికి పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించి తమ లాంటి నేతల జీవితాలను నాశనం చేశారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్‌ను గుడ్డిగా నమ్మినందుకు బాగా బుద్ధి చెప్పారని పోతిన వెంకట మహేష్ ధ్వజమెత్తారు.


Nara Lokesh: పత్రాలు తగులబెడితే చేసిన పాపాలు పోతాయా?!

మనోహర్ ఎప్పుడైనా పదిమందిని అయిన పార్టీలో చేర్పించారా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని ఎందుకు బలంగా తీసుకెళ్లలేకపోయారని నిలదీశారు. ఈ అంశాలకు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 04:30 PM

Advertising
Advertising