AP News: జోగి రమేష్‌కు ఎన్నికల కమిషన్ నోటీసులు.. కారణమిదే..?
ABN, Publish Date - Apr 04 , 2024 | 10:48 PM
వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh)కు ఎస్‌ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.
అమరావతి: వైసీపీ (YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని (నిన్న)బుధవారం నాడు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలుగుదేశం సీనియర్ నేత వర్లరామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదుపై స్పందించి వైసీపీ నేత జోగి రమేష్ (Jogi Ramesh)కు ఎస్‌ఈసీ మీనా నోటీసులు జారీ చేశారు.
AP News: ఎన్నికల్లో మీకు ఎలా కావాలంటే ఆ విధంగా పనిచేస్తా..
ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే కోర్టులో పిటీషన్ వేసి పింఛన్లు ఆపించరంటూ జోగి రమేష్ అసత్య, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. చంద్రబాబు వల్లే పింఛన్లు ఆగాయంటూ ప్రచారం చేయాలని వలంటీర్లకు జోగి రమేష్ చెబుతున్న వీడియోను ఎన్నికల సంఘానికి పంపారు. ఈ వీడియో ఆధారంగా ఆయనకు నోటీసులు పంపించారు. నోటీసు అందిన 48 గంటల్లో జోగి రమేష్ వివరణ ఇవ్వాలని నోటీసులో ఎస్‌ఈసీ మీనా పేర్కొన్నారు.
Bhuvaneswari: కడపలో భువనేశ్వరి పర్యటన.. ఎండను కూడా లెక్క చేయకుండా...
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 04 , 2024 | 10:58 PM