Share News

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా గూడూరు, నెల్లూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు..

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:53 PM

చెన్నై: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌(Christmas, New Year) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. - నెం.06039 తాంబరం - కన్నియాకుమారి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు(Superfast train) ఈనెల 24, 31 తేదీల్లో తాంబరం నుంచి అర్ధరాత్రి 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది.

Special trains: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా గూడూరు, నెల్లూరు మార్గంలో ప్రత్యేక రైళ్లు..

చెన్నై: క్రిస్మస్‌, న్యూ ఇయర్‌(Christmas, New Year) సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

- నెం.06039 తాంబరం - కన్నియాకుమారి ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు(Superfast train) ఈనెల 24, 31 తేదీల్లో తాంబరం నుంచి అర్ధరాత్రి 12.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.15 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06040 కన్నియాకుమారి - తాంబరం ప్రత్యేక సూపర్‌ఫాస్ట్‌ రైలు ఈనెల 25, జనవరి 1 తేదీల్లో కన్నియాకుమారి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 4.20 గంటలకు తాంబరం చేరుకుంటుంది.

ఈ వార్తను కూడా చదవండి: Rains: 25నుంచి మళ్లీ కుండపోత వర్షాలు..


- నెం.06043 ఎంజీఆర్‌ చెన్నై - కొచ్చువెలి వారాంతపు రైలు ఈ నెల 23, 30 తేదీల్లో ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ నుంచి రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.05 గంటలకు కొచ్చువెలి చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06044 కొచ్చువెలి - ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ వారాంతపు ప్రత్యేక రైలు ఈ నెల 24, 31 తేదీల్లో కొచ్చువెలి నుంచి రాత్రి 8.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ చేరుకుంటుంది. ఈ రైళ్ల రిజర్వేషన్‌ ప్రారంభమైందని అధికారులు తెలిపారు.

nani2.2.jpg


కుంభమేళాకు...

- నెం.06005 కన్నియాకుమారి - గయ ప్రత్యేక రైలు జనవరి 6, 20 తేదీల్లో (సోమవారం) కన్నియాకుమారి నుంచి రాత్రి 8.30 గంటలకు బయల్దేరి నాల్గో రోజు వేకువజామున 1.30 గంటలకు గయ చేరుకుంటుంది. మరోమార్గంలో నెం.06006 గయ - కన్నియాకుమారి ప్రత్యేక రైలు జనవరి 9, 23 తేదీల్లో (గురువారం) గయ నుంచి వేకువజామున 3.50 గంటలకు బయల్దేరి నాల్గో రోజు వేకువజామున 3.50 గంటలకు కన్నియాకుమారి చేరుకుంటుంది. ఈ రైళ్లు చెంగల్పట్టు, తాంబరం, చెన్నై ఎగ్మూర్‌, గూడూరు, నెల్లూరు(Gudur, Nellore) మార్గంగా వెళ్లనున్నాయి.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: మానవత్వం లేదా ?

ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్ తేల్చుకుందాం.. కేటీఆర్ సవాల్

ఈవార్తను కూడా చదవండి: అల్లు అర్జున్‌‌ వ్యాఖ్యలపై ఊహించని పరిణామం

ఈవార్తను కూడా చదవండి: ‘సత్వా ఎలిగ్జిర్‌’లో భారీ అగ్ని ప్రమాదం

Read Latest Telangana News and National News

Updated Date - Dec 22 , 2024 | 01:53 PM