Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Feb 03 , 2024 | 12:22 AM

సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ యర్నాగుల పేట, చరణ్‌దాసుపురం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి..
అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ శ్రేణులు

- అచ్చెన్నాయుడు సమక్షంలో యర్నాగులపేట, చరణ్‌దాసుపురానికి చెందిన 50 కుటుంబాలు చేరిక

కోటబొమ్మాళి/సంతబొమ్మాళి, ఫిబ్రవరి 2: సంతబొమ్మాళి మండలం నర్సాపురం పంచాయతీ యర్నాగుల పేట, చరణ్‌దాసుపురం గ్రామాల నుంచి భారీ సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వీరికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన నేతలు మాట్లాడుతూ.. వైపీపీలో ఉండి ప్రజలకు ఎలాంటి మేలు చేయలేకపోయామని, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో టీడీపీలోకి వచ్చామన్నారు. పార్టీకి చేరిన వారిలో యర్నాగుల పేటకి చెందిన వైసీపీ ఉప సర్పంచ్‌ దాసరి కిషోర్‌, నాయకులు ఎర్నాగుల అప్పారావు, రామారావు, నాగేశ్వరరావు, చెంగళరావు, గోపి, ఆనందరావు, మన్మఽథరావు, వాసుదేవరావు, అనిల్‌, అజయ్‌, గణేష్‌, శిద్దా మోహన రావు, తులసీరావు, దాసరి రఘుపతిరావుతోపాటు 30 కుటుంబాలున్నాయి. అలాగే చరణ్‌దాసుపురానికి చెందిన కటారి నరసింహులు, సదునపల్లి వెంకటరావు, రామన్న, రమేష్‌, రాము లు, అప్పారావు, వీరాస్వామి, సాయి, మల్లేష్‌లతో పాటు 20 కుటుంబాలు చేరాయి. కార్యక్రమంలో కోటబొమ్మాళి మండల పార్టీ అధ్యక్షుడు బోయిన రమేష్‌, మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి అప్పన్న, నాయకులు సువ్వారి ప్రసాదరావు, మోడి రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2024 | 12:22 AM

News Hub