Share News

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ABN , Publish Date - Feb 22 , 2024 | 11:40 PM

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడు తున్న కొద్దీ జిల్లాలో వైసీపీ నుంచి రోజు రోజుకూ టీడీపీలో చేరుతు న్న వారి సంఖ్య పెరుగుతోంది.

వైసీపీ నుంచి టీడీపీలోకి..
జి.సిగడాం: కండువా వేసి టీడీపీలోకి ఆహ్వానిస్తున్న రామ్‌మల్లిక్‌ నాయుడు

- పెరుగుతున్న చేరికలు

- పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడు తున్న కొద్దీ జిల్లాలో వైసీపీ నుంచి రోజు రోజుకూ టీడీపీలో చేరుతు న్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి పాలనపై విసుగుచెందిన వారంతా ఆ పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో గురువారం వివిధ ప్రాంతాల్లో పలువురు వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

మంగంపేటలో 10 కుటుంబాలు..

జి.సిగడాం: దేవరవలస పంచాయతీ మంగం పేట గ్రామానికి చెందిన వైసీపీ నుంచి 10 కుటుం బాలు టీడీపీలో చేరాయి. గురువారం బాబుష్యూరిటీ- భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామా నికి వెళ్లిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌ నాయుడు సమక్షంలో గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు లంకలపల్లి జగ్గారావు, లంకలపల్లి సూరీడమ్మ, లంకలపల్లి దామోదరరావు, బెల్లాపు అసిరప్పడు, కావూరి అసిరప్పడు, కోడూరి శేఖర్‌, బెల్లాపు బుచ్చిబాబు, కవూరి అప్పన్న, కోదేటి కృష్ణ కుటుంబాలు టీడీపీలో చేరాయిు. వీరిని రామ్‌మల్లిక్‌ నాయుడు పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కుమరాపు రవికుమార్‌, సర్పంచ్‌ వెంకటరావు, మండల ప్రధాన కార్యదర్శి జక్కంపూడి దాసు, కోన వెంకటరావు, గొలివి శ్రీనివాసరావు, గొళ్లాజీ, మజ్జి కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

80 మంది యువకులు..

అరసవల్లి: నగరంలోని పీఎన్‌ కాలనీ, ముచ్చువానిపేట, చౌదరి సత్యనారాయణ కాలనీ, బాయమ్మ తోట, రాయివీధి, ఆదివారం పేట, దుంప రెల్లివీధికి చెందిన సుమారు 80 మంది యువకులు గురువారం టీడీపీ నాయకుడు గొండు శంకర్‌ ఆధ్వ ర్యంలో టీడీపీలో చేరారు. ఈ మేరకు గురువారం విశాఖ-ఏ కాలనీలో గల ఆయన కార్యాలయంలో వా రికి కండువాలు వేసి ఆయన పార్టీలోకి ఆహ్వానిం చారు. ఈ సందర్భంగా శంకర్‌ మాట్లాడుతూ.. టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని, సూపర్‌ సిక్స్‌ పథకాలతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతు న్నారన్నారు. అందుకే పెద్ద ఎత్తున పార్టీలో చేరుతు న్నారన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ అంబటి లక్ష్మీరాజ్యం, మాజీ ఏఎంసీ డైరెక్టర్‌ బొల్ల నాగేంద్ర యాదవ్‌, రెడ్డి శంకర్‌, బుర్రి మధు, గొండు వెంకట రమణమూర్తి, ఎండు చిన్నారావు, గొండు శ్యామసుం దర్‌, ముద్దాడ గున్నయ్య, రాయి కిరణ్‌, పొన్నాడ ప్రసాద్‌, చెట్టు అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే నివాసంలో..

అసరవల్లిలో గల మాజీ ఎమ్మెల్యే, శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి నివాసంలో గురువారం నగరానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు. రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి కోరాడ హరగోపాల్‌ ఆధ్వర్యంలో వారంతా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Feb 22 , 2024 | 11:40 PM