వైసీపీ నుంచి టీడీపీలోకి..
ABN , Publish Date - Mar 10 , 2024 | 12:14 AM
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. శనివారం టెక్కలి నియోజకవర్గంలో 30 కుటుంబాలు వైసీపీని వీడాయి. ఆ కుటుంబాలన్నీ కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెనాయుడు సమక్షంలో టీడీపీలో చేరాయి.

- అచ్చెన్న సమక్షంలో 30 కుటుంబాలు చేరిక
టెక్కలి, మార్చి 9: ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. శనివారం టెక్కలి నియోజకవర్గంలో 30 కుటుంబాలు వైసీపీని వీడాయి. ఆ కుటుంబాలన్నీ కోటబొమ్మాళి ఎన్టీఆర్ భవన్‌లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెనాయుడు సమక్షంలో టీడీపీలో చేరాయి. టెక్కలి మండలం చాకిపల్లికి చెందిన నక్క జడ్డయ్య, వై.వసంతరావుతోపాటు కొల్లివలసకు చెందిన కె.శ్రీనివాసరావు, ఎస్.రామారావు, వి.శాఖారావు, బి.చంద్రరావు, వి.రాజారావు, పి.చంద్రయ్య, ఎం.నాగేసు, ఎస్.అప్పారావు, చిట్టి, ఎన్.నీలయ్య, ఎం.రామారావు తదితరులు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అలాగే నందిగాం మండలం కామధేనువు గ్రామానికి చెందిన కె.బాలకృష్ణ, కృష్ణారావు, మోహన్, సుబ్బారావు, సాయికుమార్, ధనుంజయ తదితరులను అచ్చెన్న సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెక్కలి, నందిగాం మండల పార్టీల అధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్, పోలాకి షణ్ముఖరావు పాల్గొన్నారు.