వైసీపీ నుంచి టీడీపీలోకి..
ABN , Publish Date - May 07 , 2024 | 12:49 AM
టెక్కలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కండువాలు కప్పి ఆహ్వానించారు.

అచ్చెన్నాయుడు సమక్షంలో భారీగా చేరికలు
టెక్కలి, మే 6: టెక్కలి నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. సోమవారం కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలో వారికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ, చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని, కూటమి అభ్యర్థుల విజయానికి పాటుపడాలని కోరారు. టీడీపీలో చేరిన వారిలో టెక్కలి మండలం మొఖలింగాపురం పంచాయతీకి చెందిన వలంటీర్ జన్ని కాంతారావుతో పాటు 20 కుటుంబాలు ఉన్నాయి. అయోధ్యపురానికి చెందిన వార్డుసభ్యులు కంచరాన యోగి, బగాది శ్రీనివాసరావు, వలంటీర్లు ముద్దాడ చిన్నారావు, బగాది ప్రతాప్, కంచరాన కవిత, పీఏసీఎస్ డైరెక్టర్ గొల్లపల్లి అశోక్‌కుమార్‌తోపాటు తదితర 35 కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నాయి. కోటబొమ్మాళి మండలం ప్రకాష్‌నగర్ కాలనీకి చెందిన 50 దళిత కుటుంబాలు, కురుడు పంచాయతీ ఎరకయ్యపేట గ్రామస్థులు టీడీపీలో చేరారు.