Chandrababu: ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే... ఇక
ABN, Publish Date - May 06 , 2024 | 12:40 PM
Andhrapradesh: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు.
అమరావతి, మే 6: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్(Former IAS Officer PV Ramesh) చేసిన ట్వీట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) స్పందించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు తానే ప్రత్యక్ష బాధితుడిని అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు. కృష్ణా జిల్లా, విన్నకోట గ్రామంలో తన తల్లిదండ్రులకు చెందిన భూముల మ్యుటేషన్‌కు తాను ఇబ్బంది పడ్డానని రమేష్ తెలిపారు. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఏపీకి సేవలందించిన తన పరిస్థితే ఇలా ఉందంటే సామాన్యుల దుస్థితిని ఊహించలేం అంటూ పీవీ రమేష్ ట్వీట్ చేశారు.
Land Titling Act: ‘నేను ప్రత్యక్ష బాధితుడినే’.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై మాజీ ఐఏఎస్ ట్వీట్
ఈ ట్వీట్‌కు చంద్రబాబు రీట్విట్ చేశారు. ‘‘జగన్ (CM Jagan) సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఊహించండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే మీ భూమి, మీ ఇళ్లు, మీ స్థలం, మీ పొలం మీది కాదు’’ అంటూ చంద్రబాబు రీట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
YS Sharmila: జగన్‌ను పైసా సాయం అడగలే, నిరూపిస్తే రాజకీయాలకు గుడ్ బై చెబుతా..!!
Lok Sabha Polls:మూడో విడతలో ప్రముఖులు.. అమిత్ షా గట్టెక్కుతారా..!
Read Latest AP News And Telugu news
Updated Date - May 06 , 2024 | 01:22 PM