ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Politics: ప్రజావేదిక ధ్వంసం నుంచి జగన్ విధ్వంస పాలన మొదలైంది: వసంత కృష్ణ ప్రసాద్

ABN, Publish Date - Apr 04 , 2024 | 07:01 PM

ప్రజావేదిక ధ్వంసం నుంచి జగన్ విధ్వంస పాలన మొదలైందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. గురువారం నాడు గొల్లపూడిలో టీఎన్ఎస్ఎఫ్ నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్ జిల్లా (గొల్లపూడి): ప్రజావేదిక ధ్వంసం నుంచి జగన్ విధ్వంస పాలన మొదలైందని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ (Vasantha Krishna Prasad) అన్నారు. గురువారం నాడు గొల్లపూడిలో టీఎన్ఎస్ఎఫ్ నేతలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలో తెలుగు నాడు విద్యార్థి సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో పేదలు ఎవరో..? పెత్తందారులు ఎవరో..? ప్రజలే తేల్చుకుంటారని చెప్పారు. సామాన్యుడి నెత్తిన పెత్తందారులను పెట్టింది ఎవరని ప్రశ్నించారు.

AP Elections: మాగంటి గోపినాథ్‌ సర్వేపై ఫైర్


తాను వైసీపీ టికెట్ ఇచ్చినా పోటీ చేయనని తేల్చిచెప్పానని కాబట్టే ఇది జగన్మోహన్ రెడ్డికి, కేపీకి మధ్య జరుగుతున్న పోటీ అంటున్నారని చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత యువకులదేనని అన్నారు. ఈ ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి మహాకూటమిని గెలిపిద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును పణంగా పెట్టారని మండిపడ్డారు. అమరావతి రాజధాని నాశనం చేసి, పరిశ్రమలు రాకుండా అడ్డుకొని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టారని ధ్వజమెత్తారు. మూడు రాజధానుల పేరిట ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి అధికారం కోసం వైసీపీ ప్రభుత్వం ఎన్నో అరాచకాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.

Gottipati Ravikumar: పేదలకు పెన్షన్ కోసం ఎందాకైనా పోరాడుతాం...


ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటేనే పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో 151 అసెంబ్లీ సీట్లు ఇస్తేనే ఇంత దుర్మార్గంగా పరిపాలించారని.. ఇప్పుడు ఇంకా వై నాట్ 175 అసెంబ్లీ సీట్లు అంటూ అన్నింటిని గెలిస్తే ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు, సామాన్యులు బతికే పరిస్థితి ఉంటుందా? అని ప్రశ్నించారు. కులాల వారీగా నాయకులను విడగొట్టి, ఏ కులం వారిని, ఆ కులం వారితోనే తిట్టించడం జగన్‌రెడ్డికి ఎంతవరకు సబబు? అని నిలదీశారు. ఈ ముఖ్యమంత్రి ప్రజానాయకుడా? ముఠా నాయకుడా? అని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఎద్దేవా చేశారు.


Ganta Srinivasa Rao: పింఛన్ల పంపిణీపై శవ రాజకీయం చేస్తున్న సీఎం జగన్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 04 , 2024 | 07:04 PM

Advertising
Advertising