Minister Anitha: పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దాం..నేతన్నలను ఆదరిద్దాం
ABN, Publish Date - Sep 29 , 2024 | 06:44 PM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని కోరారు.
అమరావతి: పండుగలకు చేనేత వస్త్రాలనే ధరిద్దామని..నేతన్నలను ఆదరిద్దామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నారా భువనేశ్వరి పిలుపు మేరకు చేనేతలకు అండగా నిలబడదామని పిలుపునిచ్చారు. పండుగలకు చేనేత వస్త్రాలను ధరించి నేతన్నలను ఆదరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
ఏపీ సచివాలయంలో హోంమంత్రి అనిత ఇవాళ(ఆదివారం) మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపు మేరకు తెలుగు ప్రజలు చేనేతలకు అండగా నిలవాలని హోంమంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు.
ఒంట్లో నరాలను దారాలుగా పోగు చేసి కష్టపడి..రక్తంతో రంగులు అద్దుతూ చెమటోడ్చే చేనేతల బతుకు చిత్రం మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. రాబోయే రోజుల్లో వరుస పండుగల నేపథ్యంలో మన సంస్కృతి, సంప్రదాయాలను చాటే వస్త్రాలను ధరించడంతో పాటు చేనేతల కళారూపాలకు పెద్దపీట వేయాలని కోరారు. ‘మన కుటుంబంతో పాటు మన ఇంట్లో ఆనందంగా పండుగ చేసుకోవడంతో పాటు చేనేత వస్త్రాలపై ఆధారపడి బతికే అందరి ఇళ్లల్లో పండుగ సంతోషం నింపాలి’ అని హోంమంత్రి వంగలపూడి అనిత కోరారు.
జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం: మంత్రి రామానాయుడు
మరోవైపు... రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. ఇవాళ(ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలో టిడ్కో ఇళ్లను మంత్రులు నిమ్మల రామానాయుడు, పొంగూరు నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ...పేదల కల నెరవేరాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.
వైసీపీ ప్రభుత్వంలో రంగులు వేశారు..
టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా.. వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు రంగులు వేశారని విమర్శించారు. ఐదేళ్ల పాటు జగన్ పాలనలో ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశామని అన్నారు. టిడ్కో ఇళ్లకు పూర్వ వైభవం తీసుకురావడం కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని అన్నారు. ఇళ్ల లబ్ధిదారులను బలవంతంగా రుణగ్రస్తులను చేశారని చెప్పారు. పది శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి లబ్ధిదారులకు అతి త్వరలో ఇళ్లను అందజేస్తామని తెలిపారు. ఒక్క పాలకొల్లులోనే రూ.150 కోట్లు ఇళ్లను తాకట్టుపెట్టి ఆ నిధులను మాజీ సీఎం జగన్ పక్క దారి పట్టించారని విమర్శించారు. ప్రపంచ స్థాయిలో మళ్లీ అమరావతిని తిరిగి నిలబెట్టేందుకు మంత్రి నారాయణ కృషి చేస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
TG Venkatesh: సిట్ ఏర్పాటుపై టీజీ వెంకటేష్ సంచలన కామెంట్స్..
PM Modi:మోదీ ఎమోషనల్.. తెలుగు వ్యక్తిపై ప్రశంసలు..
Somireddy: జగన్‌పై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Read Latest AP News and Telugu News
Updated Date - Sep 29 , 2024 | 06:45 PM