Home Minister Anitha: వైసీపీ హయాంలో ఆ కేసులు పెరిగిపోయాయి.. హోంమత్రి అనిత షాకింగ్ కామెంట్స్
ABN, Publish Date - Jun 15 , 2024 | 08:06 PM
ఏపీలో శాంతిభద్రతలు, మహిళల రక్షణ విషయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు.
అనకాపల్లి జిల్లా: ఏపీలో శాంతిభద్రతలు, మహిళల రక్షణ విషయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు కావాలని కోరుకున్నానని హోం మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) తెలిపారు. ఎన్నికల ప్రచార సమయంలో శ్రీ అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నానని.. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వామి వారిని దర్శించుకున్నానని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు ధైర్యాన్ని, మంచి పరిపాలన అందించే విధంగా స్వామి వారిని కోరుకున్నానని తెలిపారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ ,ఆడపిల్లల అదృశ్యం కేసులు పెరిగిపోయాయని మండిపడ్డారు. పోలీస్ ఉన్నతాధికారులతో చర్చించి నేరాలు అదుపు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అనంతరం హోం మంత్రి వంగలపూడి అనిత పాయకరావుపేట వెళ్లారు. ఈ సందర్భంగా అనితకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. హోంమంత్రి హోదాలో తొలిసారిగా పాయకరావుపేటలో అనిత అడుగుపెట్టారు. పుష్పగుచ్చాలు. గజమాలలతో అభిమానులు స్వాగతం పలికారు. పాయకరావుపేట పాండురంగ స్వామి ఆలయంలో పూర్ణ కుంభంతో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయంలో హోం మంత్రి అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Updated Date - Jun 15 , 2024 | 08:08 PM