Share News

AP NEWS: బీజేపీలోకి వైసీపీ ఎంపీలు .. కాశీ విశ్వనాథరాజు షాకింగ్ కామెంట్స్

ABN , Publish Date - Oct 07 , 2024 | 12:03 PM

సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కీలక ఎంపీలు మరికొంత మంది ఆ పార్టీని వీడే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

AP NEWS: బీజేపీలోకి వైసీపీ ఎంపీలు .. కాశీ విశ్వనాథరాజు  షాకింగ్ కామెంట్స్

విశాఖపట్నం: సెయిల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీ విశ్వనాథరాజు షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీ కీలక ఎంపీలు మరికొంత మంది ఆ పార్టీని వీడే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ పార్టీకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారని గుర్తుచేశారు. మరికొంత మంది వైసీపీ ఎంపీలు ఢిల్లీ బీజేపీ పెద్దలకు టచ్‎లో ఉన్నారని అన్నారు. త్వరలోనే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతారని స్పష్టం చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‎పై జగన్ హయాంలోనే విశాఖ స్టీల్ ప్లాంట్‎కి తీవ్ర అన్యాయం జరిగిందని అన్నారు. సమస్య పరిష్కారానికి జగన్ ఎటువంటి చొరవ చూపలేదని కాశీ విశ్వనాథరాజు మండిపడ్డారు.

1.jpg


స్టీల్ ప్లాంట్‎పై జగన్ కుట్ర...

‘‘స్టీల్ ప్లాంట్‎ను తీసేసి అక్కడ భూముల్లో రాజధాని పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు స్టీల్ ప్లాంట్‎ను టెకోవర్ చేసుకోవాలని.. రియల్ ఎస్టేట్ చేయాలని చూశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్టీల్ ప్లాంట్ అంశంపై రేపు(మంగళవారం) ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, ఉక్కు శాఖ మంత్రులను ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కలవనున్నారు. రేపు సానుకూలమైన నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను సెయిల్‎లో కలిపితేనే శాశ్వత పరిష్కరం దొరుకుంతుంది. త్వరలో విశాఖ ఉక్కు కార్మికులకు మంచి రోజులు వస్తాయి. తిరుపతి లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు విచారణ కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నాం. తిరుపతికి అన్యమతస్తులు ఎవరు వచ్చిన స్వామి వారి మీద విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి. గతంలో సోనియా గాంధీ, అబ్దుల్ కలాం కూడా ఇచ్చారు’’ అని కాశీ విశ్వనాథరాజు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు ప్రధానితో సీఎం భేటీ

అంగళ్లులో రాళ్ల దాడి.. బాబుపై కేసు తప్పుడుదే!

CM Revanth Reddy: ఎవరు అడ్డొచ్చినా ఆగదు..

Kishan Reddy: గోవా రైలుకు పచ్చజెండా

Read Latest AP NEWS And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 12:58 PM