Gudivada Amarnath: ఈ ఎన్నికల్లో మంత్రి గుడివాడ పోటీ చేయనట్లేనా?...
ABN, Publish Date - Mar 07 , 2024 | 01:59 PM
Andhrapradesh: ఎన్నికల్లో పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు’’ అని అన్నారు.
అనకాపల్లి జిల్లా, మార్చి 7: ఎన్నికల్లో (AP Elections 2024) పోటీపై మంత్రి గుడివాడ అమర్నాథ్ (Minister Gudivada Amarnath) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన చేయూత బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పకుంటానని స్పష్టం చేశారు. అనకాపల్లి సమన్వయకర్తగా మలసాల భరత్‌ను నియమించారని తెలిపారు. ‘‘చాలా మంది నీ పరిస్థితి ఎంటి ఎక్కడ పోటీ చేస్తావని నన్ను అడుగుతున్నారు. నాకు 15 నియోజకవర్గాల భాద్యతను సీఎం జగన్ అప్పగించారు.15 నియోజకవర్గాలను గెలిపించి.. మళ్లీ జగన్‌ను సీఎం చేస్తాము. అవసరమైతే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అందరి తలరాతలు దేవుడు రాస్తాడు నా తలరాత జగన్ మెహన్ రెడ్డి రాస్తారు’’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
YS Sharmila: జగన్, చంద్రబాబు, పవన్.. ఎవరికి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే..
TDP-Janasena:: టీడీపీ - జనసేన ఉమ్మడి ప్రయాణం ముమ్మాటికి అందుకోసమే
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
Updated Date - Mar 07 , 2024 | 02:05 PM