ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Weather Report: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. నైరుతి వచ్చేసింది

ABN, Publish Date - Jun 02 , 2024 | 05:06 PM

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనుకున్న సమయం కన్నా మూడు రోజులు ముందే రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ చెదురు ముదురుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు (Heavy Rains) పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పొడి వాతావరణం ఉన్నచోట మాత్రం కొంత ఉక్కపోత ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది మొదటి మంచి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిని సునంద పేర్కొన్నారు.


ఈసారి సకాలంలో దేశమంతా రుతు పవనాలు విస్తరించి భారీ వర్షాలు నమోదు కానున్నాయి. రెమాల్ తుపాను కూడా బంగ్లాదేశ్ వైపు మరలిపోవడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడానికి అనువైన వాతావరణం ఏర్పడింది. నైరుతి రుతు పవనాలు త్వరగా రాష్ట్రంలోకి ప్రవేశించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి త్వరగా తెలుగు రాష్ట్రాల్లో రుతు పవనాలు కదులుతుండటంతో రైతులు విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


గత ఏడాది సరైన వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈసారి జూన్ నెల సాధారణ వర్షపాతాన్ని మించి వర్షాలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. కేవలం జూన్ నెల ఒక్కటే కాకుండా సెప్టెంబర్ వరకూ సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. ఈశాన్య భారతదేశంలో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.


దక్షిణాదిన సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుంది. జూన్-సెప్టెంబర్ అధిక వర్షపాతం నమోదు కావచ్చని తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో గత మూడు రోజులుగా తీవ్రమైన ఎండ, వేడి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో 50 డిగ్రీలు దాటి అధిక ఉష్ణోగ్రత నమోదవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. నైరుతి రుతు పవనాలు త్వరగా తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశిస్తుండటంతో ఎండ, వేడిగాలుల నుంచి ఉపశమనం లభించినట్లు అవుతుందని ప్రజలు భావిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Election Counting: ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు కీలక సూచనలు

AP Election Results: హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టుకు టీడీపీ

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

For more latest Andhrapradesh news and Telugu news..

Updated Date - Jun 02 , 2024 | 05:06 PM

Advertising
Advertising