Share News

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:37 PM

పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు.

Ayyannapatrudu: డ్వాక్రా మహిళలతో 4లక్షల మెుక్కలు నాటిస్తాం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
AP Speaker Ayyannapatrudu

అనకాపల్లి: పట్టణంలోని ఎన్టీఆర్ మార్కెట్ యార్డులో నిర్వహించిన వనమహోత్సవం కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatrudu) పాల్గొన్నారు. పర్యావరణానికి చెట్లు ఎంతో మేలు చేస్తాయని, వాటిని సంరక్షిస్తేనే జీవజాతి మనుగడ సాధ్యమని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా వనమహోత్సవంలో పలు రకాల మెుక్కలను అయ్యన్నపాత్రుడు నాటారు. మెుక్కలు నాటడం ఎంతో ఆనందంగా ఉందని, జిల్లావ్యాప్తంగా మెుక్కబడి లెక్కలు చెప్పకుండా అధికారులు 60లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. వాటి సంరక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు.


డోక్రా సంఘాలతో మెుక్కలు నాటే కార్యక్రమం..

జిల్లావ్యాప్తంగా ఉన్న నాలుగు లక్షలకు పైగా డ్వాక్రా సంఘాల మహిళలతో మెక్కులు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. వనమహోత్సవం ద్వారా వారందరితో ఒక్క రోజు మెుక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి నాలుగు లక్షలకుపైగా నాటిస్తామని చెప్పారు. ప్రతి పాఠశాల, కళాశాలలోనూ కచ్చితంగా మూడు మొక్కలు నాటాలని ప్రతిపాదన చేసి యాజమాన్యాలు అమలు చేయాలని సూచించారు. ప్రతి ఇంట్లోనూ విద్యార్థులు చెట్లు పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడుతోపాటు ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, సుందరపు విజయ్ కుమార్, కలెక్టర్ విజయ కృష్ణన్ పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Actress Jithwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

Updated Date - Aug 30 , 2024 | 12:37 PM