Share News

రెండు రోజులైనా తొలగించని వైసీపీ రంగులు

ABN , Publish Date - Mar 19 , 2024 | 12:51 AM

మండలంలో ఎన్నికల నియమావళిని అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ, పబ్లిక్‌ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బొమ్మలు, రంగులు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు వంటి వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది.

రెండు రోజులైనా తొలగించని వైసీపీ రంగులు
అచ్యుతాపురం మండల కాంప్లెక్స్‌ ఆవరణలో వైసీపీ జెండా రంగులతో వున్న స్టేజీ

అచ్యుతాపురం మండలంలో సరిగా అమలుకాని కోడ్‌

అచ్యుతాపురం, మార్చి 18: మండలంలో ఎన్నికల నియమావళిని అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేయడంలేదు. ప్రభుత్వ, పబ్లిక్‌ ఆస్తులపై రాజకీయ పార్టీలకు సంబంధించిన జెండాలు, బొమ్మలు, రంగులు, పోస్టర్లు, కటౌట్లు, బ్యానర్లు, హోర్డింగులు వంటి వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. మండలంలో ఒకింత ఆలస్యంగా అయినా చాలావరకు వీటిని తీసివేయించిన అధికారులు, కొన్నిచోట్ల ప్రభుత్వ కట్టడాలకు వేసిన వైసీపీ జెండా రంగులను మాత్రం తుడిచివేయలేదు. మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఆవరణలో ఉన్న స్టేజీకి గతంలో వైసీపీ జెండా తరహాలో పైన ఆకుపచ్చ, మధ్యలో తెలుపు, దిగువున నీలం రంగులు వేయించారు. తహసీల్దార్‌, ఎంపీడీవో, పోలీస్‌స్టేషన్‌, ఎంఈఓ, స్త్రీశక్తి, పీహెచ్‌సీ, ఎంఈఓ, హౌసింగ్‌, గ్రంథాలయ శాక భవనాలన్నీ ఇక్కడే వుంది. నిత్యం ఆయా కార్యాలయాల్లో వివిధ పనుల నిమిత్తం వందలాది మంది వచ్చిపోతుంటారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి రెండు రోజులు దాటినప్పటికీ స్టేజీకి వేసిన వైసీపీ రంగులను మాత్రమే అధికారులు తొలగించలేదు.

Updated Date - Mar 19 , 2024 | 12:51 AM