Hide Tan Fast: నలుపును దాచేసేలాం
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:27 AM
ఎండ వల్ల చర్మం నల్లబడినప్పుడు సాధారణ మేకప్ సరిపోదు. సన్‌ట్యాన్‌ను దాచేందుకు కరెక్ట్ టెక్నిక్స్ పాటించాలి

మేకప్
ఎండకు చర్మం నల్లబడడం సహజం. నల్లబడిన చర్మం మీద మునుపటిలాగే మేకప్ వేసుకుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సన్ ట్యాన్‌ను దాచడం కోసం మేక్‌పలో కొన్ని మెలకువలు అదనంగా పాటించాలి.
కలర్ కరెక్టర్: ఎండకు ముఖమంతా సమంగా నల్లబడదు. చెక్కిళ్లు, నుదురు, ముక్కు, చుబుకం...ఇలా ఉబ్బెత్తుగా ఉండే ప్రదేశాలన్నీ కళ తగ్గి, నల్లబడతాయి. కాబట్టి ఈ ప్రదేశాల్లో కలర్ కరెక్టర్ ఉపయోగించాలి. దీన్ని అద్దుకుని, చర్మంలో కలిసిపోయేలా మర్దన చేసి, ఆ తర్వాతే మేకప్ పూర్తి చేసుకోవాలి.
కన్‌సీలర్: ట్యాన్ తీవ్రతను తగ్గించడం కోసం కన్‌సీలర్‌ను కూడా వాడుకోవచ్చు. ఇందుకోసం లిక్విడ్ కన్‌సీలర్‌ను ఎంచుకుని, మచ్చల మీద అప్లై చేసుకోవాలి. అయితే ఈ కన్‌సీలర్ చర్మపు రంగు కంటే ఒకట్రెండు రెట్లు లేత రంగులో ఉండేలా చూసుకోవాలి. గులాబీ రంగు నీలం రంగుల కన్‌సీలర్లకు బదులుగా చర్మపు రంగుతో నప్పే కన్‌సీలర్‌ను వాడాలి.
ఫౌండేషన్: అప్పటికే ఎండకు నల్లబడిన చర్మాన్ని మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి. కాబట్టి మాయిశ్చరైజర్, ఎస్‌పిఎఫ్ ఉండే ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి.
ట్రాన్స్‌క్యులెంట్ పౌడర్: మేకప్ చెక్కుచెదరకుండా ఉండడం కోసం ఈ పౌడర్‌ను వాడుకోవాలి. పెద్ద బ్రష్‌తో ఈ పౌడర్‌ను ముఖం మీద పలుచగా అద్దుకోవాలి.
For AndhraPradesh News And Telugu News