మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:28 AM
గ్రామీణ ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపా దనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం రాజానగరం, సీ తానగరం, కోరుకొండ మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో పలు కీలక అంశాలపై ఆయన సమీక్షిం చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందించా లన్నారు.

అధికారులతో సమీక్షల్లో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ
రాజానగరం/ సీతానగరం/కోరుకొండ, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రజలకు అవసర మైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపా దనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అధికారులను ఆదేశిం చారు. శుక్రవారం రాజానగరం, సీ తానగరం, కోరుకొండ మండలాల్లోని మండల పరిషత్ కార్యాలయాల్లో వివిధ శాఖల అధికారులతో పలు కీలక అంశాలపై ఆయన సమీక్షిం చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికలు రూపొందించా లన్నారు. గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్య లు చేపడతామన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గ్రామాల్లో పుంత రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల అభివృద్ధి, కమ్యూనిటీ భవనాలు తదితర సదుపాయాల కల్పనపై నివేదికను త యారు చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సదరు నివేదికను సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, మేజర్ డ్రైన్లపై డీపీఆర్ తయారు చేసి గ్రామాల వారీగా అం దించాలని కార్యదర్శులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతోను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి తనను కూడా అందులో చేర్చాలని సూచించారు. దీని వల్ల కమ్యూనికేషన్ బాగుంటుందని, సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు వీలుంటుందని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే రాష్ట్రంలో వాటర్ గ్రిల్ పథకం రాబోతుందని గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా పరిష్కరించాలంటే పైపు లైన్ ఎక్కడ వేయాలో నివేదిక తయారు చేయాలన్నారు. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలన్నారు. సీతానగరంలో జరిగిన సమావేశంలో ముందుగా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే బత్తుల పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు మండలాల్లో జరిగిన సమావేశాల్లో ఎంపీడీవోలు జేఏ ఝాన్సీ, భారతి, బత్తిన అశోక్‌కుమార్, ఈవోపీఆర్డీలు వాణి, మూర్తి, తహశీల్దార్ ఎ.శ్రీనివాస్, కడలి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు చిట్టూరి రంగారావు, పోలిన కృష్ణ, బీజేపీ మండలాధ్యక్షురాలు రాపాక వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు