Visakhapatnam: వైసీపీ నేతల అత్యుత్సాహం.. అనుమతులు లేకుండా విగ్రహం ఏర్పాటు..
ABN , Publish Date - Aug 26 , 2024 | 09:10 PM
ప్రశాంతంగా ఉన్న చోట వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డుతున్నారా అంటే విశాఖలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రశాంతంగా ఉన్న చోట వైసీపీ నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డుతున్నారా అంటే విశాఖలో జరిగిన ఓ ఘటన చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రధాన కూడళ్లలో ఎక్కడైనా నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేయాలంటే సంబధిత అధికారుల అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటే అధికారులు విచారణ చేసి అనుమతిస్తారు. లేదంటే వేరే ప్రాంతంలో ఏర్పాటుచేసుకోవాలని సూచిస్తారు. ప్రయివేట్ స్థలాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకపోతే విగ్రహాలు ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ విశాఖలో వైసీపీ నేతలు ఎలాంటి అనుమతులు లేకుండా హైవే సిగ్నల్ పాయింట్ వద్ద గ్రీన్ బెల్ట్‌లో వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటుచేయడం వివాదానికి దారి తీసింది. అక్కయపాలెం జాతీయ రహదారి సిగ్నల్ పాయింట్ వద్ద స్థానిక వైసీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Nara Lokesh: ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసారిగా విశాఖకు లోకేష్.. పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లు
గతంలోనూ..
వైసీపీ నాయకులు గతంలో ఇదే ప్రాంతంలో భారీ వైసీపీ జెండాను ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా విగ్రహాన్ని పెట్టడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ బెల్ట్‌లో వైఎస్సార్ విగ్రహం పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణమే అధికారులు ఈ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
AP News: ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
కూటమి నేతల డిమాండ్స్ ఇవే..
గ్రీన్ బెల్ట్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై కూటమి నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే విగ్రహాన్ని తొలగించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ.. విశాఖ మహా నగర పాలక సంస్థ అధికారులు తక్షణమే స్పందించి వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులు, జీవీఎంసీ అధికారులు కుమ్మక్కై విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. స్వతంత్ర్య దినోత్సవం రోజున ఇదే ప్రాంతంలో జాతీయ జెండా ఎగరవేస్తామంటే జీవీఎంసీ అధికారులు అనుమతులు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం విగ్రహా ఏర్పాటుపై ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. అధికారులు వెంటనే స్పందించి 24 గంటల్లో విగ్రహాన్ని తొలగించాలన్నారు. లేనిపక్షంలో తమ పార్టీ నాయకుల విగ్రహాలు పెడతామని కూటమి నేతలు హెచ్చరించారు.
Bopparaju Venkateswarlu: నెలకు రూ.54 ఇస్తే నిర్వహణ ఎలా?
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News