ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: ఎవడ్రా ఆపేది.. జగన్ జైలుకే.. పవన్ సంచలన కామెంట్స్..

ABN, Publish Date - Apr 12 , 2024 | 07:16 AM

ఎన్నికల తర్వాత జగన్‌ వెళ్లేది జైలుకేనని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హెచ్చరించారు. జగన్‌(YS Jagan) జీవితం జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసలాడుతోందన్నారు. ‘వైసీపీకి ప్యాకప్‌ చెప్పడం ఖాయమైపోయింది. జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాకుండా ఎవడ్రా ఆపేది? జగన్‌ రాష్ట్రంలో..

Pawan Kalyan

  • కూటమిని ఎవడ్రా ఆపేది?..

  • పచ్చని కోనసీమలో కుల చిచ్చు రగిల్చింది జగనే

  • కలహాల సీమ కాదు.. ప్రేమ సీమ కావాలి: పవన్‌

Andhra Pradesh: ఎన్నికల తర్వాత జగన్‌ వెళ్లేది జైలుకేనని జనసేన(Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) హెచ్చరించారు. జగన్‌(YS Jagan) జీవితం జైలుకు, బెయిల్‌కు మధ్య ఊగిసలాడుతోందన్నారు. ‘వైసీపీకి ప్యాకప్‌ చెప్పడం ఖాయమైపోయింది. జగన్‌కు రోజులు దగ్గరపడ్డాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం రాకుండా ఎవడ్రా ఆపేది? జగన్‌ రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల పొట్టకొట్టారు. జేపీ వెంచర్స్‌ను అడ్డం పెట్టుకుని.. మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జలముఠాగా ఏర్పడి ఇసుక రీచ్‌లను దోచుకున్నారు. ఇది కలహాల సీమ కాదు.. ప్రేమ సీమ.. కొబ్బరి నీళ్లు ఎంత మధురంగా ఉంటాయో అలాంటి లేత మనసున్న కోనసీమను జగన్‌ వచ్చి కలహాలు సీమగా చెయ్యడానికి ప్రయత్నం చేశాడు. భవిష్యత్‌లో కూడా కలహాల సీమగా కాకుండా, కొట్లాట సీమలా కాకుండా ప్రేమ సీమలా ఉండాలి. శెట్టిబలిజలు, మాలలు, మాదిగలు, క్షత్రియ సామాజికవర్గం, వనబలిజలు, మత్స్యకారులు, క్రిస్టియన్లు సహా 127 బీసీ కులాలు అన్యోన్యంగా ఉండాల్సిన సమయమిది. నేను వస్తే నా కులం నాయకుడితో తిట్టిస్తారు. బీసీ, ఎస్సీ నాయకులు చేత తిట్టిస్తారు. చంద్రబాబు వెళ్తున్న బండిని క్లెమోర్‌మైన్‌తో లేపేస్తే కిందపడి చొక్కా దులుపుకొని ఏమాత్రం భయంలేకుండా మళ్లీ ముందుకు వెళ్లి దశాబ్దాలపాటు రాజకీయాలు నడిపిన నేత మన చంద్రబాబు. ఉద్దానం సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్తే.. నాలుగు గంటల్లో పరిష్కారం చూపారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఏపీలోని ఐదుకోట్ల మంది ప్రజలను కాపాడడానికి త్రివేణి సంగమంలాగా కూటమిని ఏర్పాటుచేశాం. కోనసీమలో ఉన్న రెండున్నర లక్షల హెక్టార్లలో విశాలంగా ఉన్న కొబ్బరి తోటల కోసం కనీసం కోకోనట్‌ బోర్డు ఏర్పాటు చేసుకోలేకపోయాం. అంబాజీపేటలో కొబ్బరి పరిశోధన కేంద్రం ఉన్నప్పటికీ కేరళ, తమిళనాడు తరహాలో అత్యాధునికమైన పరిజ్ఞానంతో కావాల్సిన పరిశ్రమలు నెలకొల్పలేకపోయాం. కోనసీమ రైతాంగం క్రాప్‌ హాలిడే ప్రకటించింది. ఇలాంటి దుస్థితి రాకుండా ఎన్డీయే రైతు కన్నీరు తుడుస్తుంది. నేను సినిమాలు తీసుకుంటే కోట్ల రూపాయలు సంపాదించకుంటా. ఈరోజు ప్రతి అడ్డమైన వ్యక్తులు నాపై ధ్వజమెత్తుతున్నారు. ప్రజల భవిష్యత్‌ కోసం అన్నీ వదులుకుని పనిచేస్తున్నాను. యువత సొంత ప్రాంతంలోనే ఉండి ఉపాధి పొందేలా అనువజ్ఞుడైన చంద్రబాబు సహకారంతో కృషిచేస్తా. మా ప్రభుత్వం లా ఆర్డర్‌ బలంగా ఉండేలా బాధ్యత తీసుకుంటుంది.

జగన్‌ కోసం ఉద్యోగాలు వీడొద్దు..

వలంటీర్లతో జగన్‌ ఊడిగం చేయించుకునంటున్నారు. వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. వారికి ఒకటే చెబుతున్నాం. రాజకీయాలు చేయవద్దు. వైసీపీ నేతలు చెప్పారని రాజీనామా చేస్తే మళ్లీ ఉద్యోగం రాదు. వచ్చేది కూటమి.. పోయేది మీ ఉద్యోగాలు. జగన్‌ ఉద్యోగాల కోసం మీ ఉద్యోగాలు పోగొట్టుకోవద్దు. వలంటీర్లకు పారితోషికం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతాం.

కాటన్‌లా పనిచేస్తాం..

ఒకప్పుడు సర్‌ ఆర్థర్‌ కాటన్‌ మీకోసం ఎలా పనిచేశారో మా కూటమిలోని ప్రతి ఒక్కరం అదేవిధంగా పనిచేస్తాం. గంగాబొండాలను ఇచ్చే రకం కొబ్బరి మొక్కలు ఎక్కడో ఉండే వైసీపీ నాయకుల కోసం వేలాదిగా తరలిపోతున్నాయి. కోనసీమ రైతాంగానికి ఒక్క మొక్క కావాలంటే చాలా ఆంక్షలు విధిస్తున్నారు. ఈ రకం కొబ్బరి మొక్కలు ఇక్కడి రైతాంగానికి వచ్చేవిధంగా చాలా గట్టి చర్యలు తీసుకుంటాం. కోనసీమలో కొబ్బరి ఉత్పత్తులు అధికంగా ఉన్న దష్ట్యా అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కృషిచేస్తాం. రైతుభరోసా కేంద్రాలు రైతులకు అండగా ఉంటాయనుకుంటే కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్‌వైపు వెళ్లిపోయాయి. అదే మాఫియా డాన్‌తో ఇప్పుడు పోరాడుతున్నాం. మాఫియా డాన్లను తన్ని తరిమేసే వరకు నిద్రపోం. వారందరిపై చట్టపరమైన చర్యలు ఉంటాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 12 , 2024 | 07:16 AM

Advertising
Advertising