ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

YSRCP: అరెస్ట్ భయం.. పారిపోయిన వైసీపీ మాజీ ఎంపీ..?

ABN, Publish Date - Sep 04 , 2024 | 05:24 PM

పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డారా? కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్‌స్కాండ్ అయ్యారా? అరెస్ట్ భయంతో స్టేట్ దాటి వెళ్లారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ కూడా నిందితుడు. ఈ కేసులో తనన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు..

Nandigam Suresh Babu

అమరావతి, సెప్టెంబర్ 04: పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడ్డారా? కోర్టు తీర్పు రావడమే ఆలస్యం.. అబ్‌స్కాండ్ అయ్యారా? అరెస్ట్ భయంతో స్టేట్ దాటి వెళ్లారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగాం సురేష్ కూడా నిందితుడు. ఈ కేసులో తనన అరెస్ట్ చేయకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారాయన. అయితే, హైకోర్టు బెయిల్ ఇచ్చేది లేదని.. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేసింది.


జాడ దొరకని సురేష్..

హైకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్‌ను అరెస్ట్ చేసేందుకు ఆయన ఇంటికి వెళ్లారు పోలీసులు. ఆయన ఇంట్లో లేరని అక్కడి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెనుదిరిగి వెళ్లిపోయారు. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో సురేష్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. పోలీసులు వస్తారని ముందస్తు సమాచారం అందుకుని.. ఇంటి నుంచి పారిపోయారని తెలుస్తోంది. పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నందిగం సురేష్ స్టేట్ దాటిపోయే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. మరి హైకోర్టు ఉత్తర్వులను గౌరవించి పోలీసులకు లొంగిపోతారా? లేక పోలీసుల భయపడి అజ్ఞాతంలోనే ఉంటారా? అనేది వేచి చూడాలి.


వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన హైకోర్టు..

కాగా, మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్, అప్పిరెడ్డి, నందిగాం సురేష్, తలశిల రఘురామ్‌ సహా మరో 14 మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని, అరెస్ట్ నుంచి రక్షించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించే ప్రసక్తే లేదని ఏపీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.


Also Read:

స్పైడర్ మ్యాన్‌కు ఏమాత్రం తగ్గడుగా..

మావోయిస్ట్ అగ్రనేత కన్నుమూత?

సీఎం కుర్చీపై మడత పేచీలు లేవు

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Sep 04 , 2024 | 05:24 PM

Advertising
Advertising