అమెజాన్ ‘ప్రైమ్ డే’లో వెయ్యి కొత్త ఉత్పత్తులు
ABN , Publish Date - Jul 13 , 2024 | 05:19 AM
అమెజాన్ ఇండియా తన ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల 20-21 తేదీల్లో పెద్ద ఎత్తున ‘ప్రైమ్ డే’ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, హోమ్ డెకార్, ఫ్యాషన్, బ్యూటీ కేర్‌కు సంబంధించి 450 కంపెనీలు, వెయ్యికిపైగా కొత్త ఉత్పత్తులను తమ ఇ-కామర్స్ వెబ్‌సైట్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అమెజాన్ ఇండియా తన ప్రైమ్ సభ్యుల కోసం ఈ నెల 20-21 తేదీల్లో పెద్ద ఎత్తున ‘ప్రైమ్ డే’ని నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మొబైల్ ఫోన్లు, గృహోపకరణాలు, హోమ్ డెకార్, ఫ్యాషన్, బ్యూటీ కేర్‌కు సంబంధించి 450 కంపెనీలు, వెయ్యికిపైగా కొత్త ఉత్పత్తులను తమ ఇ-కామర్స్ వెబ్‌సైట్ ద్వారా అమ్మకానికి పెట్టబోతున్నట్టు అమెజాన్ డైరెక్టర్ (షాపింగ్ ఎక్స్‌పీరియన్స్, ఇండియా అండ్ ఎమర్జింగ్ మార్కెట్స్) తోట కిశోర్ విలేకరులతో చెప్పారు. సాంసంగ్, మోటరోలాతో సహా ఏడు ప్రముఖ కంపెనీలు కూడా ప్రైమ్ డే సమయంలో తమ కొత్త ఉత్పత్తులను విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. దాదాపు అన్ని కంపెనీలు తమ బ్రాండ్లు, ఉత్పత్తులపై ప్రత్యేక డిస్కౌంట్లు, కాష్‌బ్యాక్‌లు ఆఫర్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రైమ్ డే రోజు అమెజాన్ ద్వారా కొనే వస్తువుల్లో 10 లక్షల వస్తువులను అదే రోజు, మరో 14 లక్షల వస్తువులను మరుసటి రోజు ప్రైమ్ సభ్యులకు డెలివరీ చేస్తామన్నారు.