IPO News: ఐపీవో బాటలో మూడు కంపెనీలు..
ABN , Publish Date - Apr 05 , 2025 | 10:24 PM
భారతీయ స్టాక్ మార్కెట్‌లో మూడు కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లతో (ఐపీఓ) ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను (DRHP) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించాయి.

భారతీయ స్టాక్ మార్కెట్‌లో మూడు కంపెనీలు తమ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌లతో (ఐపీఓ) ప్రవేశించడానికి సిద్ధమవుతున్నాయి. ఈ సంస్థలు తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌లను (DRHP) మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించాయి.
పార్క్ మెడి వరల్డ్ లిమిటెడ్:
ఈ సంస్థ "పార్క్" బ్రాండ్‌తో 13 NABH గుర్తింపు పొందిన మల్టీ-సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్వహిస్తోంది. ఐపీఓ ద్వారా రూ. 1,260 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్‌లో కొత్త షేర్లతో పాటు ప్రస్తుత వాటాదారుల విక్రయానికి కూడా అవకాశం ఉంది. 2024 సెప్టెంబర్ 30 నాటి గణాంకాల ప్రకారం, 3,000 పడకల సామర్థ్యంతో పార్క్ మెడి వరల్డ్ ఉత్తర భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రైవేట్ ఆసుపత్రుల గొలుసుగా ఉంది. హర్యానాలో 1,600 పడకలతో రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ చెయిన్‌గా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. నువామా వెల్త్ మేనేజ్‌మెంట్, సీఎల్ఎస్ఏ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఇంటెన్సివ్ ఫిస్కల్ సర్వీసెస్ ప్రైవేట్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా పనిచేస్తున్నాయి.
జైన్ రిసోర్స్ రీసైక్లింగ్ లిమిటెడ్:
ఈ సంస్థ నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ రంగంలో పనిచేస్తోంది. ఐపీఓ ద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఆఫర్‌లో కొత్త షేర్లతో పాటు ప్రస్తుత వాటాదారుల విక్రయానికి కూడా అవకాశం ఉంది. 2022-2024 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆదాయంపరంగా భారత్‌లో అతి పెద్దదైన, వేగంగా వృద్ధి చెందుతున్న నాన్-ఫెర్రస్ మెటల్ రీసైక్లింగ్ దిగ్గజంగా కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో లెడ్ ఇన్‌గోట్ బ్రాండ్‌ను లిస్ట్ చేసిన రెండు దేశీయ రీసైక్లింగ్ కంపెనీల్లో జైన్ రిసోర్స్ ఒకటి. బీఆర్ఎల్ఎంలతో సంప్రదింపుల ఆధారంగా రూ. 100 కోట్ల వరకు ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ చేపట్టే అంశాన్ని కంపెనీ పరిశీలించనుంది. ప్రీ-ఐపీవో ప్లేస్‌మెంట్ పూర్తయితే, సమీకరించిన మొత్తాన్ని తాజా ఇష్యూ నుంచి తగ్గిస్తారు. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను నిర్దిష్ట రుణాలను చెల్లించడం కోసం, ఇతర కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించనుంది. డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, పీఎల్ క్యాపిటల్ మార్కెట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.
ప్రోజీల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్:
ఈ సంస్థ గ్రీన్ ఎనర్జీ రంగంలో కార్యకలాపాలు సాగిస్తుంది. ఈ సంస్థ IPO ద్వారా 700కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఒక్కో షేర్ ముఖ విలువ 2 రూపాయలుగా నిర్ణయించారు.