Sindhura Narayana: గ్లోబల్ లీడర్‌గా అవతరించిన నారాయణ
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:29 AM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, నాసా ప్రోత్సహించిన నేషనల్ స్పేస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎ్‌సఎస్ పోటీల్లో నారాయణ విద్యార్థులు సత్తాచాటడంతో గ్లోబల్ లీడర్‌గా అవతరించినట్లు ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు.

అమెరికా ఎన్‌ఎ్‌సఎస్ పోటీల్లో 99 ప్రాజెక్టులకు అవార్డులు
వరల్డ్ గ్రాండ్ ప్రైజ్, వరల్డ్ నంబర్1 స్థానంలో 12 సెలక్షన్లు
హైదరాబాద్, ఏప్రిల్ 5 (ఆంధ్ర జ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన, నాసా ప్రోత్సహించిన నేషనల్ స్పేస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్‌ఎ్‌సఎస్ పోటీల్లో నారాయణ విద్యార్థులు సత్తాచాటడంతో గ్లోబల్ లీడర్‌గా అవతరించినట్లు ఆ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధూర నారాయణ, శరణి నారాయణ తెలిపారు. వరల్డ్ గ్రాండ్‌ప్రైజ్‌తోపాటు వరల్డ్ నంబర్ 1 స్థానంలో 12 సెలక్షన్లను తమ విద్యార్థులు దక్కించుకున్నారని, భారత్‌లో ఏ ఇతర విద్యాసంస్థ ఇలాంటి అరుదైన ఘనత సాధించలేదన్నారు. వరల్డ్ నం.2 స్థానంలో 17, వరల్డ్ నం.3 స్థానంలో 14 సెలక్షన్స్‌తోపాటు 55 హానరబుల్ ప్రైజ్‌లను తమ విద్యార్థులు కైవసం చేసుకున్నారని తెలిపారు. మొత్తంగా 99 ప్రాజెకుల్లో విజయకేతనం ఎగురవేశారని తెలిపారు.
తమ విద్యార్థుల విజయాల శాతం అంతర్జాతీయ స్థాయిలో 34.1 శాతం ఉండగా, జాతీయస్థాయిలో 58.5శాతంగా ఉందన్నారు. పోటీ పరీక్షలకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామ్స్‌ను అమలుచేస్తున్న ఏకైక విద్యాసంస్థ నారాయణేనని తెలిపారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీపరీక్షల్లో తమ విద్యార్థులు సాధిస్తున్న విజయాల వెనుక నారాయణ ఉన్నతమైన ప్రణాళిక, బోధన వెన్నుదన్నుగా నిలుస్తున్నాయని తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా సీబీఎ్‌సఈతో కూడిన సమగ్ర పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టి విద్యనందించడం వల్లనే ఇలాంటి ఫలితాలు వెలువడుతున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునిత్ అభినందించారు.