Ramulori Kalyanam: నేడు రామతీర్థంలో రాములోరి పెళ్లి
ABN , Publish Date - Apr 06 , 2025 | 04:21 AM
నేడు రామతీర్థంలో శ్రీసీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు

పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్
నెల్లిమర్ల, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): శ్రీరామ నవమి వేడుకలకు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని రామస్వామి దేవస్థానం సిద్ధమైంది. సీతారాముల కల్యాణోత్సవానికి దేవస్థానం ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. దేవస్థానం వెనుక ఉన్న ప్రత్యేక వేదికపై కల్యాణోత్సవం జరగనుంది. కల్యాణం తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అందజేయనున్నారు.
నేడు భద్రాద్రి రామయ్యకు టీటీడీ పట్టువస్త్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి వారికి టీటీడీ తరపున పట్టువస్ర్తాలు సమర్పించనున్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు పట్టువస్ర్తాలు సమర్పిస్తారు.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News