Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
ABN , Publish Date - Dec 09 , 2024 | 07:17 PM
హర్యానాలోని పానిపట్‌లో 'బీమా సఖి స్కీమ్'ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. మహిళా సాధికారత దిశగా ఇదొక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ స్కీం వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (narendra modi) హర్యానా (haryana)లోని పానిపట్‌లో మహిళల కోసం ఒక కీలక పథకాన్ని ప్రారంభించారు. అదే ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన (మహిళా కెరీర్ ఏజెంట్లు - MCA ) స్కీం. మహిళల స్వావలంబన, ఆర్థికంగా సాధికారత సాధించేందుకు ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ పథకం పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
LIC బీమా సఖీ యోజన అంటే ఏంటి?
LIC బీమా సఖీ యోజన అనేది LIC ఏజెంట్లుగా మహిళలకు శిక్షణ అందించి, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడానికి ప్రారంభించిన స్టైపెండరీ పథకం. ఈ పథకం కింద మూడేళ్ల శిక్షణ కాలంలో మహిళలకు ప్రతినెలా స్టైఫండ్ అందజేస్తారు.
ఎవరు అర్హులు
కనీస విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణత కల్గి ఉండాలి
వయోపరిమితి: దరఖాస్తు సమయంలో కనీస వయస్సు 18 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు
శిక్షణ కాలం: మూడేళ్లు.
స్టైపెండ్: మొదటి సంవత్సరం: నెలకు రూ. 7,000
రెండో సంవత్సరం: నెలకు రూ. 6,000 (మొదటి సంవత్సరం పాలసీలు 65% అమల్లో ఉండాలి)
మూడో సంవత్సరం: నెలకు రూ. 5,000 (రెండో సంవత్సరం పాలసీలు 65% అమలులో ఉండాలి)
దరఖాస్తుతో పాటు కింది పత్రాలను సమర్పించడం తప్పనిసరి:
వయస్సు రుజువు పత్రం (స్వీయ-ధృవీకరణ)
చిరునామా రుజువు పత్రం (స్వీయ-ధృవీకరణ)
విద్యా అర్హత సర్టిఫికేట్ (స్వీయ-ధృవీకరణ)
పాస్‌పోర్ట్ సైజు ఫోటో
అసంపూర్ణ సమాచారం లేదా తప్పిపోయిన పత్రాలు అప్లికేషన్ తిరస్కరించబడటానికి అవకాశం ఉంది
ఎవరు అనర్హులు:
ఇప్పటికే ఉన్న ఏజెంట్లు లేదా LIC ఉద్యోగుల బంధువులు.
రిటైర్డ్ ఉద్యోగులు లేదా LIC మాజీ ఏజెంట్లు
MCA పథకం ముఖ్యమైన సూచనలు
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది స్టైపెండరీ పథకం మాత్రమే. కార్పొరేషన్‌లో శాశ్వత ఉపాధిగా పరిగణించబడదు.
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజనకు ఎలా దరఖాస్తు చేయాలంటే
- ముందుగా https://licindia.in/test2 అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి
- తర్వాత క్రిందికి స్క్రోల్ చేసి, క్లిక్ ఫర్ బీమా సఖి లింక్‌పై క్లిక్ చేయండి
- ఆ క్రమంలో వచ్చిన దానిలో మీ పేరు, పుట్టిన తేదీ సహా పలు వివరాలను పూర్తిచేయండి
- మీరు ఏదైనా LIC ఇండియా ఏజెంట్, డెవలప్‌మెంట్ ఆఫీసర్, ఉద్యోగి లేదా మెడికల్ ఎగ్జామినర్‌తో కనెక్ట్ ఆ వివరాలు కూడా ఇవ్వండి
- పూర్తి వివరాలు ఇచ్చిన తర్వాత సబ్‌మిట్ బటన్ క్లిక్ చేయండి
పనితీరు ప్రమాణాలు:
సంవత్సరానికి కనీసం 24 పాలసీలు చేయాల్సి ఉంటుంది. ఆ క్రమంలో మీరు మొదటి సంవత్సరం పాలసీలు విక్రయించడం ద్వారా కమిషన్ రూపంలో గరిష్టంగా రూ. 48,000 వేల వరకు అందుకుంటారు.
ఈ స్కీం ప్రధాన లక్ష్యం
ఎల్‌ఐసీ బీమా సఖీ యోజన ప్రధాన లక్ష్యం మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం అందించడం. ఈ పథకం మహిళలకు విజయవంతమైన కెరీర్ ఏజెంట్‌గా మారడానికి అవకాశం కల్పించడం ద్వారా స్వావలంబన పొందేందుకు సహాయపడుతుంది. ఈ పథకం కింద మహిళలకు సాధికారత కల్పించేందుకు వారు చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. దీనిని మోదీ ఉపాధి కల్పనకు శక్తివంతమైన మాధ్యమంగా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం.. ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Next Week IPOs: ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్.. వచ్చే వారం ఏకంగా 11 ఐపీఓలు..
Free Government Schemes: ఉచిత పథకాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆర్థిక శాఖ.. కారణమిదే..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Read More Business News and Latest Telugu News