Nina Kothari: ముఖేష్ అంబానీ సోదరి గురించి తెలుసా.. భర్తను కోల్పోయినా వందల కోట్ల కంపెనీకి..
ABN , Publish Date - Jul 08 , 2024 | 01:48 PM
మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
మీరెప్పుడైనా దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తలైన ముఖేష్ అంబానీ(Mukesh Ambani), అనిల్ అంబానీ(Anil Ambani) సోదరి గురించి విన్నారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని అనేక మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. తన భర్త క్యాన్సర్ వ్యాధితో మృతి చెందినా కూడా వందల కోట్ల వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆమెనే నీనా కొఠారి(Nina Kothari). కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఛైర్‌పర్సన్.
నీనా రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు దివంగత ధీరూభాయ్ అంబానీ కుమార్తె. అంబానీ ఇద్దరు సోదరీమణులలో నీనా(Nina Kothari) చిన్నావిడ. వ్యాపారవేత్త భద్రశ్యామ్ కొఠారిని నీనా 1986లో వివాహం చేసుకున్నారు. కానీ ఆయన 2015లో క్యాన్సర్ కారణంగా మరణించారు. ఆ సమయంలోనే ఆమెకు కుమార్తె నయనతార కొఠారి, కుమారుడు అర్జున్ కొఠారి ఉన్నారు. అయినప్పటికీ ఆమె తన ఇద్దరు పిల్లల పెంపకంతోపాటు కంపెనీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు కూడా స్వీకరించారు.
ఆ క్రమంలో తన కుటుంబ వ్యాపారమైన కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(Kothari Sugars and Chemicals Limited)కు ఏప్రిల్ 8, 2015న బాధ్యత వహించారు. ఆమె జీవితంలో ఇది ఒక మలుపు అని చెప్పవచ్చు. ఆ తర్వాత నీనా ఓర్పు, పట్టుదలతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని వ్యాపారాన్ని విజయపథంలో నడిపించారు. నీనా సంకల్పం, పట్టుదల ఫలితంగా మరికొన్ని సంస్థలను నెలకొల్పే స్థాయికి ఎదిగారు. వాటిలో కొఠారి పెట్రోకెమికల్స్ లిమిటెడ్, కొఠారీ సేఫ్ డిపాజిట్స్ లిమిటెడ్ ఉన్నాయి.
ప్రస్తుతం ఆమె పెద్ద కుమారుడు అర్జున్ కొఠారి, కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండగా, ఇక నీనా కుమార్తె నయనతార KK బిర్లా మనవడు, శ్యామ్ శోభనా భారతీయుల కుమారుడు షమిత్ భారతియాను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నీనా నికర సంపద విలువ రూ. 52.4 కోట్లకుపైగా ఉంది. దీంతోపాటు ఆమె రెండు పబ్లిక్‌గా ట్రేడ్ చేయబడిన షేర్‌లను కలిగి ఉంది. ఐసిఐసిఐ డైరెక్ట్ ప్రకారం కొఠారి షుగర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ మార్కెట్ విలువ 435 కోట్ల రూపాయలకుపైగా ఉండటం విశేషం.
ఇది కూడా చదవండి:
Budget 2024: బడ్జెట్ 2024లో ఈ స్కీంల పరిస్థితి ఏంటి.. ఈసారైనా పెంచుతారా?
Viral Video: రాధిక మర్చంట్ సోదరిని చుశారా.. చీరలో మాములుగా లేదుగా..
Rains: 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. మరో 11 రాష్ట్రాలకు అలర్ట్
For Latest News and Business News click here