Share News

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

ABN , Publish Date - Dec 18 , 2024 | 06:28 PM

మీరు 7 కోట్ల రూపాయల మొత్తాన్ని దీర్ఘకాలంలో సేవ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారా. అయితే దీని కోసం ఎక్కడ పెట్టుబడులు చేయాలి, ప్రతి నెల ఎంత సేవ్ చేయాలి, ఎన్నేళ్లు సేవ్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..
Personal Finance

ఓ వ్యక్తి సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాడు. ఆ క్రమంలో నెల జీతం నుంచి బిల్లులు చెల్లించడం, ఇంటి పనులను చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ వ్యక్తి ఓసారి ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఉన్నాడు. ఇలాగే అనేక రోజులు గడిచాయి. ఆ క్రమంలోనే ఆ వ్యక్తి ఓ పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకునే ప్రయత్నం చేస్తూ, తన ఆర్థిక భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.


నెలకు కొంత మొత్తంలో..

అందుకోసం తన మిత్రుడి ద్వారా సిప్ (Systematic Investment Plan) గురించి తెలుసుకున్నాడు. దీంతోపాటు ఇతర పెట్టుబడుల మధ్య దీన్ని పోల్చి చూశాడు. సిప్ విధానంలో ఎక్కువ రాబడులు వస్తున్నాయని గమనించి దీనిలో క్రమంగా పెట్టుబడులు చేయాలని భావించాడు. ఆ క్రమంలో తన ఖర్చుల పోయిన తర్వాత నెలకు రూ. 10,000 మాత్రమే పెట్టుబడిగా పెట్టాలనుకున్నాడు. మొదట్లో పెద్ద లాభాలు కనబడలేదు. కానీ అదే క్రమంగా సంవత్సరాలు గడిచే కొద్దీ, అతని పెట్టుబడులు నెమ్మదిగా పెరుగుతూ వెళ్లాయి.


మొత్తం పెట్టుబడి ఏంతంటే..

ఆ విధంగా ప్రతి నెలలో రూ. 10,000 చొప్పున ఆ వ్యక్తి సిప్‌లో పెట్టుబడులు పెడుతూ 30 సంవత్సరాలు సేవ్ చేశాడు. దీంతో పెరిగిన మార్కెట్‌ ఆధారంగా 15% సగటు వార్షిక రాబడితో తన పెట్టుబడులు భారీగా పెరిగాయి. మొత్తం 30 సంవత్సరాల తర్వాత ఆయన ఖాతాలో దాదాపు రూ. 7,00,98,206 కోట్లు వచ్చాయి. ఆ క్రమంలో ఆయన చేసిన పెట్టుబడులు మొత్తం రూ. 36,00,000 లక్షలు కాగా, ఆదనంగా వచ్చిన మొత్తం మాత్రం 6,64,98,206 కోట్ల రూపాయలు. ఈ క్రమంలో కేవలం లక్షల రూపాయలు సేవ్ చేస్తే కొన్నేళ్లలోనే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.


మీ పిల్లల పెళ్లి లేదా..

కాబట్టి ఉద్యోగం చేసే సమయంలో చిన్న వయస్సు నుంచే సేవింగ్స్ చేయడం ప్రారంభిస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చని అంటున్నారు. సహనంతో పెట్టుబడులు పెడితే అద్భుత ఫలితాలు రావడంతోపాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవచ్చని తెలిపారు ఆర్థిక నిపుణులు. దీర్ఘకాలంలో మంచి డబ్బు సంపాదించడానికి అనేక పెట్టుబడి మార్గాలు అందుబాటులో ఉన్నాయి.

వాటిలో మ్యూచువల్ ఫండ్ SIP కూడా ఒకటి. దీనిలో దీర్ఘకాలంలో పెద్ద కార్పస్‌ను నిర్మించడంలో మ్యూచువల్ ఫండ్ SIP చాలా సహాయకారిగా ఉంటుంది. దీనిని మీరు మీ పిల్లల చదువులు లేదా మీ పిల్లల పెళ్లి వంటి అనేక ఇతర కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవచ్చు. మీ అవసరాలన్నింటినీ తీర్చడంలో మ్యూచువల్ ఫండ్ SIP కీలక పాత్ర పోషిస్తుంది.

గమనిక: సిప్ విధానంలో పెట్టుబడులు చేయాలని ఆంధ్రజ్యోతి చెప్పడం లేదు. మాకు లభించిన సమాచారం తెలియజేస్తున్నాము. సిప్ పెట్టుబడులు మార్కెట్ లాభనష్టాలకు లోబడి ఉంటాయి.


ఇవి కూడా చదవండి:

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Viral News: రూ.10 వాటర్ బాటిల్‌ రూ.100.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్


Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..


Narayana Murthy: 70 గంటల పని విధానాన్ని మళ్లీ ప్రస్తావించిన నారాయణమూర్తి.. ఈసారి ఏం చెప్పారంటే..


Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు

Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..

Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 18 , 2024 | 06:29 PM