Stock Market: స్టాక్ మార్కెట్ ఢమాల్.. ఇన్వెస్టర్లు ఎన్ని లక్షల కోట్లు నష్టపోయారంటే..
ABN , Publish Date - Oct 03 , 2024 | 02:39 PM
భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ నష్టాలతో దూసుకెళ్తుంది. ఈ క్రమంలో ప్రధాన సూచీలైన బీఎస్‌ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50 భారీగా క్షీణించాయి. అయితే ఇంత భారీగా ఎందుకు నష్టాలు వచ్చాయి. కారణాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock market) గురువారం భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. మిడిల్ ఈస్ట్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇండెక్స్ డెరివేటివ్‌ల కొత్త రూల్స్ సహా పలు అంశాల నేపథ్యంలో సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1,804 పాయింట్ల నష్టంతో 82,461 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 552 పాయింట్లు పతనమై 50,556 స్థాయిలో ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 1205 పాయింట్లు కోల్పోయి 51708 పరిధిలో ఉండగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 1402 పాయింట్లు తగ్గి 58938 స్థాయిలో ఉంది. ఈ క్రమంలో మదుపర్లు కొన్ని గంటల్లోనే దాదాపు 11 లక్షల కోట్లు నష్టపోయారు.
టాప్ 5 స్టాక్స్
ఈ నేపథ్యంలో ప్రస్తుతం BPCL, ఏషియన్ పెయింట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, లార్సెన్ టాప్ 5 నష్టాల స్టాక్స్‌లో ఉండగా, BSE సెన్సెక్స్‌లో కేవలం రెండు స్టాక్‌లు మాత్రమే లాభపడ్డాయి JSW స్టీల్ (1.66 శాతం పెరిగింది). టాటా స్టీల్ మినహా అన్ని ఇతర స్టాక్‌లు క్షీణించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా అత్యధికంగా నష్టపోయింది (2.23 శాతం తగ్గింది), ఆ తర్వాతి స్థానాల్లో ఏషియన్ పెయింట్స్, టాటా మోటార్స్, మారుతీ సుజుకి ఇండియా, పవర్ గ్రిడ్ కార్ప్ ఉన్నాయి. నిఫ్టీ 50లో హిందాల్కో ఇండస్ట్రీస్ లాభపడగా, మిగతా అన్ని స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఐషర్ మోటార్స్ (312 శాతం పతనం), బజాజ్ ఆటో, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్‌లలో అత్యధిక పతనం జరిగింది.
రూ.10 లక్షల కోట్లు
ఈ క్రమంలోనే ఎం క్యాప్ విలువ రూ.10.56 లక్షల కోట్లు క్షీణించగా, నిఫ్టీ బ్యాంక్ దాదాపు 2 శాతం పడిపోయింది. ముడి చమురు పెరగడంతోపాటు పెయింట్, OMC స్టాక్స్ మందగించాయి. Q2 అప్‌డేట్ తర్వాత డాబర్ ట్యాంక్ 8% రాబడి క్షీణతను నెలకొల్పింది. KRN హీట్ ఎక్స్ఛేంజర్ స్టాక్ 118% ప్రీమియంతో ప్రారంభమైంది. మరోవైపు రిలయన్స్ పవర్, రిలయన్స్ ఇన్‌ఫ్రా షేర్లు 5% వరకు పెరిగాయి. F&Oలో రిటైల్ వ్యాపారులను రక్షించడానికి సెబీ కొత్త చర్యలు, NSE ఆప్షన్ ప్రీమియం టర్నోవర్‌ను 40% వరకు తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకించి ప్రతి ఎక్స్‌ఛేంజ్‌కి ఒక వారం గడువులను పరిమితం చేయడం వల్ల చిన్న పెట్టుబడిదారులు రక్షించబడతారని భావిస్తున్నారు.
ఇతర మార్కెట్లు
మరోవైపు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ జపనీస్ స్టాక్‌లు ఆసియా మార్కెట్లలో లాభాలతో మొదలయ్యాయి. నిక్కీ 225 2.57 శాతం లాభపడగా, టాపిక్స్ ఇండెక్స్ 2 శాతం లాభపడింది. ఆస్ట్రేలియా S&P/ASX 200 కూడా 0.25 శాతం లాభపడింది. అదే సమయంలో హాంగ్ కాంగ్ హ్యాంగ్ సెంగ్ ఇండెక్స్ ఫ్యూచర్స్ 22,438 వద్ద ఉన్నాయి. ఇది మునుపటి ముగింపు 22,443.73 కంటే కొంచెం తక్కువగా ఉంది. అమెరికాలోని ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. S&P 500 0.01 శాతం లాభపడి 5,709.54 వద్ద ముగియగా, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 39 పాయింట్లు పెరిగి 42,196.52 వద్ద, నాస్‌డాక్ కాంపోజిట్ 0.08 శాతం లాభంతో 17,925.12 వద్ద ముగిసింది.
ఇవి కూడా చదవండి:
SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
Cash Deposit Machine: క్యాష్ డిపాజిట్ మెషిన్ ద్వారా రోజు ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం.
Read More Business News and Latest Telugu News