Narayana Murthy: 70 గంటల పని విధానాన్ని మళ్లీ ప్రస్తావించిన నారాయణమూర్తి.. ఈసారి ఏం చెప్పారంటే..
ABN , Publish Date - Dec 16 , 2024 | 03:29 PM
70 గంటలు పనిచేయాలనే విషయంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ పురోగతికి యువత కృషి చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
వారానికి 70 గంటలు పని చేయాలనే అంశంపై ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి (Narayana Murthy) మరోసారి పునరుద్ఘాటించారు. భారతదేశాన్ని నంబర్‌వన్‌గా మార్చేందుకు మనం కష్టపడి పనిచేయాలని, యువత అర్థం చేసుకోవాలని సూచించారు. 800 మిలియన్ల (80 కోట్లు) భారతీయులు ఉచిత రేషన్‌ను పొందుతున్నందున మనం మన ఆకాంక్షలను గుర్తుంచుకోవాలన్నారు. అంటే 800 మిలియన్ల భారతీయులు పేదరికంలో ఉన్నారని, మనం కష్టపడి పని చేసే స్థితిలో లేకుంటే ఎలా అని పేర్కొన్నారు.
మనం చేయాల్సింది చాలా..
ఇన్ఫోసిస్‌లో తాము అత్యుత్తమ కంపెనీల వద్దకు వెళ్తామని మూర్తి పేర్కొన్నారు. ఆ క్రమంలో ఒక్కోసారి మనల్ని మనం అత్యుత్తమ గ్లోబల్ కంపెనీలతో పోల్చుకుంటే, భారతీయులమైన మనం చేయాల్సింది చాలా ఉందని అనిపిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను ఒకప్పుడు వామపక్ష వాదినని, నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (IIT) వాస్తవరూపం దాల్చిందన్నారు. మూర్తి ఆదివారం కోల్‌కతాలో ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన క్రమంలో పేర్కొన్నారు.
మార్పు రావాలి
భారతదేశం పనితీరుకు ప్రపంచం గౌరవం ఇస్తోందని ఈ సందర్భంగా ప్రస్తావించారు మూర్తి. పనితీరు గుర్తింపును తెస్తుందని, గుర్తింపు గౌరవాన్ని ఇస్తుందని, గౌరవం శక్తిని తెస్తుందని అభిప్రాయపడ్డారు. మన వ్యవస్థాపకుల కలను నెరవేర్చే పెద్ద బాధ్యత మనపై ఉందని యువతకు సూచించారు. అందుకోసం మనమందరం కష్టపడి పనిచేయాలని కోరారు. 70వ దశకం ప్రారంభంలో తనకు పారిస్‌లో పనిచేసే అవకాశం వచ్చిందని, ఆ క్రమంలో తాను గందరగోళానికి గురయ్యానని చెప్పారు. పాశ్చాత్య దేశాలు భారతదేశం ఎంత మురికిగా, అవినీతిలో కూరుకుపోయిందని మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. కానీ నా దేశంలో పేదరికం ఉందని, రోడ్లపై గుంతలు కూడా ఉన్నాయన్నారు.
మంచి రోడ్లు, మంచి రైళ్లు..
పాశ్చాత్య దేశాల్లో అందరూ చాలా సంపన్నులుగా ఉన్నారని మూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. రైళ్లు సకాలంలో నడుస్తున్నాయి. ఒక దేశం ఉపాధిని సృష్టించినప్పుడే పేదరికంతో పోరాడగలదని నారాయణ మూర్తి పేర్కొన్నారు. అది క్రమంగా ఆదాయానికి దారితీస్తుందన్నారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదు. వ్యవస్థాపకులు ఉద్యోగాలను సృష్టించడం వల్లనే దేశాలను నిర్మిస్తారని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
ఒక దేశం పెట్టుబడిదారీ విధానాన్ని అవలంబిస్తే మంచి రోడ్లు, మంచి రైళ్లు, మంచి మౌలిక సదుపాయాలు వస్తాయన్నారు. భారతదేశం వంటి పేద దేశంలో పెట్టుబడిదారీ విధానం పాతుకుపోలేదన్నారు. చైనీస్ ఉద్యోగులు భారతీయుల కంటే 3.5 రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉన్నారని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఇవి కూడా చదవండి:
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Advance Tax Deadline: ఈరోజే ఐటీఆర్ అడ్వాన్స్ ట్యాక్స్ డెడ్‌లైన్.. రేపు కూడా చెల్లించవచ్చా..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bima Sakhi Yojana 2024: మహిళలకు మంచి ఛాన్స్.. బీమా సఖీ యోజనతో రూ. 48 వేలు సంపాదించే అవకాశం..
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More Business News and Latest Telugu News