Paytm: విజయ్ శేఖర్ ధీమాతో ఎగబాకిన పేటీఎం షేర్లు.. ఏకంగా 9.87 శాతానికి
ABN , Publish Date - Jul 08 , 2024 | 04:40 PM
One 97 Communications Ltd (Paytm మాతృ సంస్థ) షేర్లు సోమవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. పేటీఎం ఒక్కొక్క షేరు ధర 9.87 శాతం ఎగబాకి రూ.479.70కి చేరుకుంది. చివరిగా 8.44 శాతానికి చేరుకుని రూ.473.40 వద్ద ట్రేడవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: One 97 Communications Ltd (Paytm మాతృ సంస్థ) షేర్లు సోమవారం ఒక్కసారిగా పుంజుకున్నాయి. పేటీఎం ఒక్కొక్క షేరు ధర 9.87 శాతం ఎగబాకి రూ.479.70కి చేరుకుంది. చివరిగా 8.44 శాతానికి చేరుకుని రూ.473.40 వద్ద ట్రేడవుతోంది.
ఆర్బీఐ ఆంక్షల తరువాత దీని షేర్లు 26.73 శాతం పడిపోయిన విషయం తెలిసిందే. అయితే పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ చేసిన కామెంట్సే షేర్లలో అనూహ్య పెరుగుదలకు కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. పేటీఎంను 100 బిలియన్ డాలర్ల కంపెనీగా మార్చాలని తాను కోరుకుంటున్నానని, అదే తన లక్ష్యమని విజయ్ ఇటీవల పేర్కొన్నారు.
"పేటీఎం కంపెనీ నా కుమార్తె లాంటింది. మేం కలిసే ఎదిగి, లాభాల బాటలో పరిగెత్తాం. జీవితంలో ముఖ్యమైన ప్రవేశ పరీక్షకు నా కుమార్తె సిద్ధమవుతున్నట్టు భావించా. కానీ ఆమె అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఇప్పుడు ఐసీయూలో ఉంది. ప్రొఫెషనల్ స్థాయిల్లో చూస్తే, మేం ఇంకా మెరుగ్గా ప్రదర్శించాల్సింది. పరిస్థితులను ముందుగానే అర్థం చేసుకుని, బాధ్యతలను నెరవేర్చి ఉండాల్సింది. తాజా పరిస్థితులతో పాఠాలు నేర్చుకున్నాం" అని సీఈవో విజయ్ అన్నారు.
స్టాక్‌లో పేటీఎం చరిత్ర..
2021లో ఐపీఓగా మార్కెట్‌లోకి వచ్చిన పేటీఎం స్టాక్ రూ. 1,783 వద్ద గరిష్ఠాన్ని నమోదు చేసింది. ఆర్బీఐ ఆంక్షలతో ఏడాది కాలంలో పేటీఎం షేర్లు దాదాపు 49 శాతం పతనమయ్యాయి. 2024లో ఇప్పటివరకు సుమారు 33 శాతం నష్టాల్లోకి కూరుకుపోయాయి. తాజాగా పరిస్థితుల్లో స్వల్ప మార్పు కనిపిస్తోంది.
For Latest News and National News click here