Stock Market: వారాంతంలో లాభాల జోష్.. సెన్సెక్స్ 260 పాయింట్ల ప్లస్!
ABN , Publish Date - May 10 , 2024 | 04:17 PM
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి
గురువారం భారీగా నష్టపోయిన దేశీయ సూచీలు శుక్రవారం కాస్త కోలుకున్నాయి. 1000 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపర్లకు నష్టాలను మిగిల్చిన సెన్సెక్స్ శుక్రవారం కాస్త ఉపశమనం కలిగించింది. కనిష్టాల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీలు లాభాల్లో పయనించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో పాటు, ఎక్కువ వెయిటేజీ కలిగిన స్టాక్స్ లాభపడడంతో సెన్సెక్స్ లాభాలను కళ్లజూసింది. (Business News).
శుక్రవారం ఉదయం 72,475 వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఓ దశలో 72,946 ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. చివరకు 260 పాయంట్ల లాభంతో 72,664 వద్ద రోజును ముగించింది. నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 22,055 వద్ద రోజును ముగించింది. మళ్లీ 22 వేలకు పైన క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 66 పాయింట్లు కోల్పోయింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 423 పాయింట్లు లాభపడింది.
సెన్సెక్స్‌లో ప్రధానంగా యూపీఎల్, పాలీక్యాబ్, మనప్పురం ఫైనాన్స్, లాల్ పాథ్ ల్యాబ్స్ షేర్లు లాభాలు ఆర్జించాయి. బిర్లా సాఫ్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, గోద్రేజ్ ప్రాపర్టీస్, ఏసీసీ నష్టాలను మూటగట్టుకున్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.50గా ఉంది.
ఇవి కూడా చదవండి..
Gold and Silver Rates: అక్షయ తృతీయ సందర్భంగా గుడ్ న్యూస్..తగ్గిన గోల్డ్ ధర
పసిడి రుణాలపై నగదు రూ.20,000 మించొద్దు: ఆర్‌బీఐ
మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..