Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ABN , Publish Date - Aug 07 , 2024 | 10:25 AM
సైబర్ మోసాలు ఆగడం లేదు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన వ్యక్తికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ముంబై నుంచి క్రైమ్ బ్రాంచి నార్కోటిక్ పోలీసులం మాట్లాడుతున్నాం అంటూ పరిచయం చేసుకున్నారు.
- నార్కోటిక్ పోలీసులమంటూ బెదిరించి.. రూ. 5.90 లక్షలు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్
- స్టాక్ మార్కెట్లో అధిక లాభాలంటూ రూ.13.07 లక్షలు కొల్లగొట్టారు
హైదరాబాద్ సిటీ: సైబర్ మోసాలు ఆగడం లేదు. సికింద్రాబాద్(Secunderabad)కు చెందిన వ్యక్తికి ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వాట్సాప్ కాల్ చేశారు. ముంబై నుంచి క్రైమ్ బ్రాంచి నార్కోటిక్ పోలీసులం మాట్లాడుతున్నాం అంటూ పరిచయం చేసుకున్నారు. ముంబై నుంచి ఇరాన్(Mumbai to Iran)కు వెళ్తున్న పార్సిళ్లలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన పార్సిల్ దొరికింది. దాంట్లో ఎండీఎంఏ డ్రగ్స్ ఉన్నాయి. ఆ పార్సిల్ మీ పేరుతో ఇరాన్ వెళ్తుందని ఆ వ్యక్తి ఆధార్‌కార్డుతో పాటు.. అడ్రస్ కూడా చెప్పి భయపెట్టారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మావాళ్లు ఎట్లున్నరో..! నగరంలో బంగ్లాదేశీయుల ఆందోళన
ఈ కేసు నుంచి మీరు బయటపడాలన్నా, మీకు ఎలాంటి సంబంధం లేదని నిరూపించాలన్నా మొత్తం మూడు దశల్లో అధికారులను మేనేజ్ చేయాలని అందుకు కొంత ఖర్చవుతుందని, లేదంటే అరెస్టు చేయక తప్పదని బెదిరించారు. రూ. 5.90 లక్షలు కొల్లగొట్టారు. ఆ తర్వాత కాల్ కట్ చేశారు. కాసేపటి తర్వాత తేరుకున్న బాఽధితుడు అయోమయానికి గురై సిటీ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
స్టాక్‌మార్కెట్లో లాభాలంటూ..
నగరానికి చెందిన 38 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగికి గూగుల్(Google)లో ఒక ప్రకటన కనిపించింది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని, ప్రతీ రోజు 5-10 శాతం ప్రాఫిట్‌ను అందుకోవచ్చని ప్రకటనలో రాసి ఉంది. దాంతో బాధితుడు ఆ యాడ్ లింక్‌ను క్లిక్ చేసి, వివరాలు నమోదు చేశాడు. వెంటనే లైన్‌లోకి వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని ఏవో టు- యూపీ స్టాక్ సర్వీస్ గ్రూపులో యాడ్ చేశారు. పెట్టుబడులు పెట్టించారు. ప్రారంభంలో మంచి లాభాలు వచ్చినట్లు చూపించి వాటిని విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ కల్పించారు. అలా మెల్లగా ఊబిలోకి దింపి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి, అధిక మొత్తంలో ఐపీఓ షేర్లు కేటాయించారు.
అందుకు అవసరమైన డబ్బులు లేవని చెప్పినా వినకుండా మీ పేరుతో మేమే రుణం తీసుకొని చెల్లించామని చెప్పారు. ఆ తర్వాత రూ. కోట్లలో లాభాలు వచ్చినట్లు చూపించారు. అనంతరం విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. ఇదేంటని బాధితుడు నిలదీశాడు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే నిబంధనల ప్రకారం.. మీ పేరుతో తీసుకున్న రుణం చెల్లించాలని, అప్పుడే విత్‌డ్రా ఆప్షన్ కల్పిస్తారని బుకాయించారు. అలా విడతలవారీగా రూ. 13.07లక్షలు కొల్లగొట్టారు. ఇంకా ఇంకా డబ్బులు చెల్లించాలని వేధించడంతో అనుమానం వచ్చిన బాధితుడు సిటీ సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.
ఇదికూడా చదవండి: TG News: పీవీఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే పైనుంచి దూకిన గుర్తు తెలియని వ్యక్తి
ఇదికూడా చదవండి: RBI Official: రూ.40 కోట్ల ఆర్థిక మోసం కేసు.. బషీద్‌కు ఆర్‌బీఐ అధికారి సహకారం?
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో త్వరలో ఉప ఎన్నికలు!