Share News

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం

ABN , Publish Date - Aug 29 , 2024 | 04:05 PM

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్, కంకేర్ జిల్లాల సరిహద్దులో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎన్‌కౌంటర్(encounter) కొనసాగుతోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. దీంతోపాటు ఘటనా స్థలంలో పలు రకాల వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.

Encounter: అడవుల్లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మహిళలు మృతి, ఆయుధాలు స్వాధీనం
chhattisgarh Encounter

ఛత్తీస్‌గఢ్‌(chhattisgarh)లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన నారాయణపూర్ జిల్లాలో మళ్లీ కాల్పులు(gunfight) కలకలం రేపుతున్నాయి. భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మరణించారు. ఈ మేరకు పోలీసు అధికారులు గురువారం సమాచారం అందించారు. నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్మద్ ప్రాంతంలో ముగ్గురు యూనిఫాం మహిళా నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయని పోలీసు అధికారులు తెలిపారు.


పక్కా సమాచారం

అయితే నారాయణపూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులోని అబుజ్‌మద్ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలను గస్తీకి పంపించారు. ఈ బృందంలో జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), STF, సరిహద్దు భద్రతా దళం (BSF) సిబ్బంది ఉన్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని అధికారులు తెలిపారు. అనంతరం సైనికులు కూడా ఎదురుకాల్పులు చేయగా కాల్పుల్లో ముగ్గురు మహిళా నక్సలైట్లు మృత్యువాత పడ్డారు.


ఘటనా స్థలంలో

ఈ నేపథ్యంలో ఘటనా స్థలం నుంచి ఇప్పటి వరకు ముగ్గురు మహిళా నక్సలైట్ల మృతదేహాలు, ఆయుధాలు, ఇతర వస్తువులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో భద్రతా బలగాలు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఉదయం నుంచి ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోందని బస్తర్‌ ఐజీ పీ సుందర్‌రాజ్‌ తెలిపారు. అడపాదడపా కాల్పులు జరుగుతున్నాయని, సైనికులంతా క్షేమంగా ఉన్నారని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

Viral Video: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యర్థిని ఓడించిన రాహుల్ గాంధీ

Cyber Alert: ఇమెయిల్‌కు వచ్చే ఈ లెటర్ల విషయంలో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్

Read More Crime News and Latest Telugu News

Updated Date - Aug 29 , 2024 | 04:08 PM