Share News

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పులే నైవేద్యంగా ఎందుకు పెడతారు..

ABN , Publish Date - Apr 02 , 2025 | 08:47 PM

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున ఎక్కడ చూసినా దేవుడికి నైవేద్యంగా పానకం, వడపప్పు పెడుతుంటారు. ఎన్నో రకాల వంటకాలున్నా ఈ 2 పదార్థాలే రాములవారికి నైవేద్యంగా సమర్పించడం గల కారణం మీకు తెలుసా.

Sri Rama Navami 2025: శ్రీ రామనవమి రోజున పానకం, వడపప్పులే నైవేద్యంగా ఎందుకు పెడతారు..
Sri Rama Navami special foods

Sri Rama Navami 2025: శ్రీరామ నవమి వచ్చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ ప్రత్యేకత అంతా సీతారాముల కళ్యాణం చుట్టూనే తిరుగుతుంది. ప్రతి ఇంట్లో శ్రీరాముడికి పూజలు, కల్యాణం, నైవేద్యాలు పెడతారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి లోగిలి భక్తి పారవశ్యంలో మునిగిపోతాయి. ఈ ప్రత్యేక రోజున నైవేద్యంగా చల్లదనాన్ని అందించే పానకం, ఆరోగ్యానికి ఉపకరించే వడపప్పు తప్పనిసరిగా సిద్ధం సేవిస్తారు. ఇవి చేసే విధానంలోనూ ఒక సంప్రదాయం ఉంది. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఈ నైవేద్యాలను ఆధునిక జీవన శైలిని అనుసరిస్తున్నా ఎలా తయారుచేసుకోవాలనో మరువకూడదని తెలుసుకోండి.


పానకం :

పానకం వేసవిలో ఆవశ్యకమైన ఆరోగ్య పానీయం. ఎండ తీవ్రతను తగ్గించడంలో సహాయపడే పానకం తయారీ ఎంతో సులభం. బెల్లం, మిరియాలపొడి, శొంఠి, యాలకుల పొడి, తులసి దళాలతో కలిపి చేసిన ఈ మిశ్రమం శరీరానికి చల్లదనం అందించడంతో పాటు డీహైడ్రేషన్‌ నుంచి కాపాడుతుంది. నిమ్మరసం పానకం రుచిని మరింత పెంచడమే కాకుండా విటమిన్ సీ అందిస్తుంది. ఇవన్నీ కలిపి చేసిన బెల్లం పానకం ఒక ఆయుర్వేద టానిక్‌లా పనిచేస్తుంది. రోజూ కాకపోయినా ఏడాదికి ఒకసారి తాగినా శరీరానికి ఈ పానకం అమితమైన బలాన్ని ఇస్తుంది.


వడపప్పు :

వేసవిలో భోజనం చాలా తేలికగా ఉండాలని అంటారు. అటువంటి సమయంలో వడపప్పు మేలైన ఆహారం. తేలికగా జీర్ణమయ్యే ప్రొటీన్ రిచ్ నైవేద్యం. నానబెట్టిన పెసరపప్పులో కొద్దిగా పచ్చిమిర్చి, ఉప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేస్తే చాలు. అద్భుతమైన ప్రొటీన్ నైవేద్యం తయారవుతుంది. ఇది తింటే జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు దూరమవుతాయి. వేసవిలో వేడి వల్ల వచ్చే నీరసం, అలసటను ఈ వడపప్పు తిని సమర్థంగా ఎదుర్కోవచ్చు.


ఇది పండుగ మాత్రమే కాదు.. ఆరోగ్యానికి ఉపకారం చేసే ఆచారం.. పానకం తాగడం, వడపప్పు తినడం అన్నీ ఒక్క పండుగ నైవేద్యాలే కాదు. ఇవి మన ఆరోగ్యాన్ని సమర్థంగా కాపాడే ఆచారాలు. మన శరీరానికి కావలసిన సహజ ఔషధాల్లా పనిచేసే ఈ 2 పదార్థాలను ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు వేసవి కాలం ముగిసేవరకూ రోజూ తీసుకోవచ్చు.


పానకం తయారీ విధానం:

1. బెల్లాన్ని చిన్న ముక్కలుగా తరగండి.

2. ఒక లీటర్ నీటిలో బెల్లాన్ని వేసి బాగా కలిపి కరిగించండి.

3. ఈ బెల్లం నీటిలో మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడి, నిమ్మరసం, ఉప్పు, పచ్చకర్పూరం వేసి బాగా కలపండి.

4. చివరగా తులసి దళాలు వేసి కలిపితే పానకం రెడీ.


వడపప్పు తయారీ విధానం:

1. పెసరపప్పును శుభ్రంగా కడిగి అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టండి.

2. నీరు వడకట్టి గిన్నెలో వేసుకోండి.

3. అందులో తరిగిన పచ్చిమిర్చి, ఉప్పు, కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి బాగా కలిపితే వడపప్పు సిద్ధం.


Read Also: Fasting: ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి..

Spiritual: మడి కట్టుకోవడం అంటే ఏమిటో తెలుసా

Sri Rama Navami: శ్రీరామనవమి రోజు.. ఇలా చేయండి.. చాలు

Updated Date - Apr 02 , 2025 | 08:48 PM