Share News

Maha shivaratri 2024: శివరాత్రి రోజున శివుడ్ని ఎలా అభిషేకించి తరించాలి.. !

ABN , Publish Date - Mar 08 , 2024 | 04:34 PM

శివుడిని రుద్ర అవతారంలో అభిషేకిస్తారు. పవిత్రమైన జలాలు, పువ్వులు, బిల్వ దళాలు సమర్పిస్తారు. 108 సార్లు శివ మంత్రాలను పఠిస్తూ అభిషేకిస్తారు. దుష్ట భయాలు తొలగి సుఖ సౌఖ్యాలు కలిగే విధంగా అభిషేకం జరిపిస్తారు.

Maha shivaratri 2024: శివరాత్రి రోజున శివుడ్ని ఎలా అభిషేకించి తరించాలి.. !
Maha shivaratri 2024:

మహా శివరాత్రి (Maha shivaratri) రోజున శివాభిషేకం చేస్తే శివ కటాక్షం లభిస్తుంది. అభిషేక ప్రియుడైన శివుడు కాసిని నీళ్ళతో తృప్తి పడతాడు. కోరిన వరాలను తీర్చే పరమ శివుడు ఈ శివరాత్రి రోజున శివనామ స్మరణతో మారుమ్రోగే వేళ అభిషేకంతో ఆయన కరుణను పొందే సమయం. ప్రతి సంవత్సరం 12 శివరాత్రులు వస్తాయి. అందులో ఏడాదిలో వచ్చే మహా శివరాత్రి శివునికి అత్యంత ప్రీతికరమైనది. ప్రతి ఏడాది మాఘ మాసం కృష్ణపక్ష చతుర్దశి తిథిలో మహా శివరాత్రి వస్తుంది. పురాణాల ప్రకారం ఈ శివరాత్రి రోజునే శివపార్వతులు వివాహం జరిగిందని ప్రతీతి.

శివరాత్రి (shivaratri) రోజున శివునికి అభిషేకించేటప్పుడు కొన్ని విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. అవేమిటంటే..

గరిక నీటితో శివుని అభిషేకిస్తే పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి పొందవచ్చు. అలాగే పసుపు నీటితో అభిషేకం చేయడం అనేది మంగళప్రదం. ఇంటికి జయం. మామిడి పండ్ల రసం అభిషేకిస్తే దీర్ఘకాలిక వ్యాధులు నశిస్తాయి. ఆవు పాలతో (Milk) అభిషేకం చేసినట్లైతే సర్వ సౌఖ్యములను పొందవచ్చు. నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే అపమృత్యువు నశించి ధీర్ఘాయువు కలుగుతుంది. ద్రాక్ష రసంతో అభిషేకిస్తే చేపట్టిన ప్రతి కార్యంలో విజయాన్ని అందుకుంటారు. అన్నాభిషేకం చేస్తే మోక్షము కలుగుతుంది., దీర్ఘాయువు కలుగుతుంది. బంగారం నీటితో శివునికి అభిషేకం చేస్తే.. దారిద్ర్యం తొలగిపోతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతారు. భస్మాభిషేకం చేస్తే మహా పాపాలు తొలగిపోతాయి. రుద్రాక్ష జలాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి.

రుద్రాభిషేకంలో తప్పక పాటించాల్సిన నియమాలు ఇవి..

శివుడిని రుద్ర అవతారంలో అభిషేకిస్తారు. పవిత్రమైన జలాలు, పువ్వులు, బిల్వ దళాలు సమర్పిస్తారు. 108 సార్లు శివ మంత్రాలను పఠిస్తూ అభిషేకిస్తారు. దుష్ట భయాలు తొలగి సుఖ సౌఖ్యాలు కలిగే విధంగా అభిషేకం జరిపిస్తారు. ఈ అభిషేకం చేసేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ అవసరం. శివలింగం తూర్పు, ఉత్తర దిక్కు వైపు మాత్రమే ఉండేలా చూసి పూజ చేయాలి. శివాభిషేకం జరిగేటప్పుడు లింగాన్ని ఎడమ చేతితో తాకరాదు. నిష్టగా పూజా కార్యక్రమాన్ని చేయాలి.

ఇది కూడా చదవండి: శివుడికి చేసే అభిషేకాలతో ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసా..!

శివరాత్రి రోజున జాగారం చేయడం వల్ల కలిగే ఉపయోగాలేంటి.. ! అసలు ఎందుకు చేయాలి.


జోతిర్లింగాలలో శివాభిషేకాలు..

కంచిలో గల ఏకామ్రేశ్వర శివలింగం పృధ్వీలింగం. ఈ లింగానికి ధారాభిషేకం ప్రీతి. ఈ లింగానికి అభిషేకం చేయడం వల్ల సకల పాపాలు నశిస్తాయని ప్రతితీ.

జంబుకేశ్వరంలోని జంబుకేశ్వర లింగం జల లింగం. ఈ లింగ రూపునికి ఆవృత్త్భాషేకం ప్రీతి.

రుద్రాభిషేకం.. తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడి తేజోలింగం. తేజోరూపధారికి రుద్రాభిషేకం ప్రీతి.


ఇది కూడా చదవండి: బ్రెడ్ ఫ్రూట్ గురించి విన్నారా? దీనిలో ఎన్ని పోషకాలంటే..!

చిదంబరంలోని చిదంబరేశ్వరుడు ఆకాశలింగం. ఆకాశలింగధారియైన శివునకు శతరుద్రాభిషేకం ప్రీతి.

శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వరుడు వాయు లింగం ఈ వాయు రూపధారి అయిన శివునకు ఏకాదశ రుద్రాభిషేకం ఇష్టం.

జలాభిషేకం, పాలాభిషేకం, తేనె, పంచామృతం ఇలా ఈ పవిత్ర శివరాత్రి రోజున భక్తులు తన శక్తి కొలది శివుడిని అర్చించి, జాగరణతో తరిస్తారు.

Updated Date - Mar 08 , 2024 | 05:52 PM