ఈ వారమంతా వీరికి లక్కేలక్కు..
ABN , Publish Date - Apr 06 , 2025 | 07:38 AM
ఈ వారమంతా ఆ రాశి వారికి లక్కేలక్కని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే కొన్ని రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని కూడా సూచిస్తున్నారు. మొత్తంమీద వారివారి రాధిఫలాలు ఏ వివిధంగా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే..

అనుగ్రహం
6 - 12 ఏప్రిల్ 2025
పి.ప్రసూనా రామన్
మేషం
అశ్విని, భరణి,
కృత్తిక 1వ పాదం
కార్యసాధనకు ఓర్పు ముఖ్యం. సంకల్పబలంతోనే లక్ష్యం సాధిస్తారు. అవకా శాలు చేజారినా కుంగిపోవద్దు. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. లావాదేవీలతో తీరిక ఉండదు. ఖర్చులు విపరీతం. అవసరాలు అతికష్టం మీద నెరవేరుతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. పిల్లల విజయం సంతోషం కలిగిస్తుంది. కీలక పత్రాలు అందు కుంటారు. ఫోన్ సందేశాలను పట్టించు కోవద్దు. సన్నిహితులను సంప్రదిస్తారు.
వృషభం
కృత్తిక 2,3,4; రోహిణి,
మృగశిర 1,2 పాదాలు
నిర్దేశిత ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. వాహనం కొనుగోలు చేస్తారు. బుధవారం నాడు పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. సంస్థల స్థాపనకు అనుకూలం. పత్రాల రెన్యువల్‌లో జాప్యం తగదు. ఆరోగ్యం జాగ్రత్త. తరచూ బంధువులతో సంభాషిస్తారు. పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఇంటి విషయాలపై శ్రద్ధ వహి స్తారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.
మిథునం
మృగశిర 3,4; ఆర్ద్ర,
పునర్వసు 1,2,3 పాదాలు
గ్రహాల సంచారం బాగుంది. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పొదుపు ధనం అందుతుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. మీ విజ్ఞత ఆకట్టుకుం టుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సభ్యత్వాలు స్వీకరిస్తారు. అందరితో కలుపుగోలుగా మెలగండి. కొత్త విషయాలు తెలుసు కుంటారు. శుభకార్యానికి హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
కర్కాటకం
పునర్వసు 4వ
పాదం, పుష్యమి, ఆశ్లేష
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. సమర్థతను చాటుకుంటారు. కీలక అంశాల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసు కోండి. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. శనివారం నాడు నగదు, వాహనం జాగ్రత్త. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. తరచూ సన్నిహితులతో సంభాషిస్తారు. పిల్లల చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.
సింహం
మఖ, పుబ్బ,
ఉత్తర 1వ పాదం
ప్రతికూలతలు అధికం. ఆలో చనలు నిలకడగా ఉండవు. అన్యమస్కంగా గడుపుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. ఖర్చులు తగ్గించుకుంటారు. వాయిదాల చెల్లింపుల్లో ఏకాగ్రత వహించండి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. లావాదేవీల్లో ఆచితూచి అడుగేయండి.
కన్య
ఉత్తర 2,3,4; హస్త,
చిత్త 1,2 పాదాలు
సంప్రదింపులతో తీరిక ఉండదు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. పనిభారం, అకాలభోజనం. వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. పెట్టుబడులకు తరుణం కాదు. మీ నిర్ణయాన్ని వాయిదా వేయండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. దళారులను ఆశ్రయించవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోండి.
తుల
చిత్త 3,4; స్వాతి,
విశాఖ 1,2,3 పాదాలు
కార్యం సిద్థిస్తుంది. లక్ష్యానికి చేరువవుతారు. అన్ని విధాలా ప్రోత్సాహకరం. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. కలిసి వచ్చిన అవకాశాన్ని తక్షణం అందిపుచ్చు కోండి. సందేహాలకు తావివ్వవద్దు. ఆదాయా నికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. కీలక వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. ఎదురుచూస్త్తున్న పత్రాలు అందుతాయి. శుభకార్యానికి హాజరవుతారు.
వృశ్చికం
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ
గ్రహాల సంచారం బాగుంది. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. పరస్పరం కానుకలిచ్చి పుచ్చుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు విపరీతం. వాయిదా చెల్లింపుల్లో జాప్యం తగదు. మీ అలక్ష్యం ఇబ్బందులకు దారితీస్తుంది. పనులు, బాధ్య తలు స్వయంగా చూసుకోండి. ఆర్థిక విష యాలు గోప్యంగా ఉంచండి. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు.
ధనుస్సు
మూల, పూర్వాషాఢ,
ఉత్తరాషాఢ 1వ పాదం
మీదైన రంగంలో రాణిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తి చేయగల్గుతారు. పత్రాల్లో మార్పుచేర్పులు అనుకూలిస్తాయి. గృహ మరమ్మతులు చేపడతారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం తగదు.
మకరం
ఉత్తరాషాఢ 2,3,4;
శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. మీ సమర్థతపై నమ్మకం కలుగు తుంది. దృఢసంకల్పంతో అడుగు ముందు కేస్తారు. సాయం ఆశించవద్దు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. చెల్లింపుల్లో జాప్యం తగదు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తిచేస్తారు. ఆత్మీయులతో కాల క్షేపం చేస్తారు. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆరోగ్యం కుదుట పడుతుంది. నోటీసులు అందుకుంటారు.
కుంభం
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు
ఈ వారం ఆశాజనకం. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. వ్యవహారాలతో తీరిక ఉండదు. ఏకాగ్రత తగ్గకుండా చూసు కోండి. ఒంటెద్దుపోకడ తగదు. ఎదుటివారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోండి. అయినవారి కోసం విపరీతంగా ఖర్చు చేస్తారు. మీ సాయంతో ఒకరికి మేలు జరు గుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బల పడతాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఆలోచనల్లో మార్పు వస్తుంది.
మీనం
పూర్వాభాద్ర 4వ
పాదం, ఉత్తరాభాద్ర, రేవతి
సర్వత్రా అనుకూలదాయకం. అనుకూల ఫలితాలున్నాయి. మీ కష్టం ఫలిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ వ్యక్తిత్వానికి భంగం కలుగకుండా మెలగండి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు.