Ram Navami 2025: శ్రీరామ నవమి రోజున.. రక్ష దారాన్ని ఇలా కట్టుకుంటే అంతా శుభమే..
ABN , Publish Date - Apr 06 , 2025 | 09:08 AM
శ్రీరామ నవమి పండుగ రోజున రక్ష స్తోత్రం పఠిస్తే అనేక లాభాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. రామ రక్షను పఠించడం వల్ల నాలుక తిరగడంతో పాటూ మాట మెరుగుపడుతుందట. అలాగే రక్ష దారాన్ని ఈ పద్ధతిలో చేతికి కట్టుకుంటే ఎంతో మంచిదట. ఈ పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో శ్రీరామ నవమి ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ పండుగను భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీరామ చంద్రుడి ఆశీస్సుల కోసం భక్తులంతా ఆలయాలకు క్యూకడుతుంటారు. ఈ పండుగ వేళ భక్తులు పూజలను మధ్యాహ్న సమయంలో నిర్వహించాలని వేద పండిపతులు చెబుతున్నారు. శ్రీరాముడు మధ్యాహ్న సమయంలో జన్మించినందున.. అదే సమయంలో పూజలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఈ పండుగ రోజున శ్రీరామ రక్షను పఠించి, చేతికి దారం కట్టుకుంటే అంతా శుభం జరుగుతుందని చెబుతున్నారు. ఆ పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
శ్రీరామ నవమి (Sri Rama Navami) పండుగ రోజున రక్ష స్తోత్రం పఠిస్తే అనేక లాభాలు ఉన్నాయని వేద పండితులు చెబుతున్నారు. రామ రక్షను పఠించడం వల్ల నాలుక తిరగడంతో పాటూ మాట మెరుగుపడుతుందట. అలాగే శ్రీరాముడు నక్షత్ర రూపంలో భక్తులను రక్షిస్తాడట. అదేవిధంగా జీవితంలో ఎదురయ్యే ప్రతికూల ప్రభావాల నుంచి కూడా రక్షణ లభిస్తుందట. రామ రక్షను పఠించడంతో పాటూ కొన్ని ప్రత్యేక పరిహారాలను కూడా చేయాలని పండితులు చెబుతున్నారు.
రక్ష దారాన్ని ఇలా కట్టుకుంటే..
శ్రీరామ రక్షను పఠించడంతో పాటూ ఎరుపు, పసుపు దారం తీసుకుని రామ రక్ష చెప్పాలని వేద పండితులు సూచిస్తున్నారు. దారంలో ముందు ఒక ముడిని వేయాలని, దానికి కొద్ది దూరంలో రామ రక్షగా మరొక ముడిని వేయాలని చెబుతున్నారు. ఇలా రామ రక్షను 11 సార్లు చెబుతూ.. దారంపై 11 ముడులను వేయాలట. ఆ తర్వా ఆ దారాన్ని శ్రీరాముడి పాదాల వద్ద ఉంచి పూజ చేయాలి. చివరగా ఆ దారాన్ని మణికట్టుపై కట్టుకుంటే అంతా శుభమే జరుగుతుందని చెబుతున్నారు.