Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
ABN, Publish Date - May 05 , 2024 | 08:56 PM
తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.
జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.
జోగులాంబ జిల్లాలోని ఎర్రవల్లిలో ఈరోజు (ఆదివారం) కాంగ్రెస్ ‘‘జనజాతర’’ సభ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు ఘాటైన కౌంటర్ ఇచ్చారు. ‘‘నువ్వు(కేటీఆర్) చీరకట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి హైదరాబాద్ నుంచి జోగులాంబ అమ్మవారి వద్దకు వెళ్లు, ఆ బస్సులో ఒక్క పైసా అడిగితే ఆరు పథకాలు అమలు కానట్టు’’ అని రేవంత్‌రెడ్డి కేటీఆర్‌కు ప్రతి సవాల్ విసిరారు.
ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చిన బీజేపీ (BJP)కి కర్రుకాల్చి వాత పెట్టాలని రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో గుజరాత్ వర్సెస్ తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శించారు. ఈ ఎన్నికల్లో గుజరాత్ మోదీని ఓడించి, తెలంగాణ ఇచ్చిన రాహుల్ గాంధీని గెలిపించి కాంగ్రెస్ సత్తా చాటుదామని పిలుపునిచ్చారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీఆర్ఎస్ - బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
Harish Rao: మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఇలాగేనా మాట్లాడేది
లోక్‌సభ ఎన్నికల్లో గద్వాలలో బంగ్లా రాజకీయాలకు చెక్ పెట్టాలంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఎంపీగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ను నేడు ఆమె కనుమరుగు చేయాలని చూస్తోందని ఫైర్ అయ్యారు. జోగులాంబ అమ్మవారి సాక్షిగా ఈనెల 9 తేదీ లోపు రైతు భరోసా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
Hyderabad: అసదుద్దీన్ ప్రచారం తీరు మారిందా? గత ఎన్నికలకు భిన్నంగా ప్రచార శైలి
Read Latest Election News or Telugu News
Updated Date - May 05 , 2024 | 09:20 PM