CM Revanth: ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వదులుతా... కేసీఆర్‌కు సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్
ABN, Publish Date - Apr 21 , 2024 | 09:21 PM
తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
యాదాద్రి: తమ ప్రభుత్వం ఉండదంటావా లాగులో తొండలు వేసి నల్గొండ బిడ్డలతో కొట్టిపిస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. ఇంకోసారి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం నాడు భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ రోడ్ షోలో సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి హాజరయ్యారు.
Bandi Sanjay : ఓట్ల కోసం శ్రీరాముడిని వాడుకోవడం లేదు
కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈ రోడ్ షోలో బీఆర్ఎస్, బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల పేరుతో కేసీఆర్ ఎలక్షన్.. సెలక్షన్, కలెక్షన్ చేశారని మండిపడ్డారు. భూమికి మూడు అడుగులున్న సీసాల సోడా పోసే ఒకరు(మాజీ మంత్రి జగదీష్ రెడ్డిని) ఉద్దేశించి కోమటిరెడ్డి బ్రదర్స్‌పై వ్యంగంగా మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. తనతో పాటు ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికేనని అన్నారు. వేల అబద్ధాలు చెప్పి రూ. 7లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ 100 రోజులకే కాంగ్రెస్‌ను ఓడగొట్టాలని అనడం ధర్మమా అని ప్రశ్నించారు.
Secunderabad: బీజేపీకి దూరంగా జనసేన!
పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రాన్ని తప్పుపట్టిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో ఓట్లు ఎలా అడుగుతారని నిలదీశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ వెనుక గూడు పుఠానీ జరుగుతోందని మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డ కవిత బెయిల్ కోసం భువనగిరిలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి బ్రదర్స్ డబుల్ ఇంజన్ లాంటి వాళ్లని అభివర్ణించారు.
Madhavilatha: పాతబస్తీలో ఒవైసీ బ్రదర్స్ ఆటలు సాగనివ్వను...
భువనగిరిలో 3లక్షల మెజార్టీతో కిరణ్‌ను గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్‌గా మారి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. చామల కిరణ్‌ను గెలిపిస్తే 50వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేస్తామని మాటిచ్చారు. యాదాద్రిని యాదగిరిగుట్టగా మారుస్తామని.. మళ్లీ వచ్చి యాదగిరిగుట్ట అభివృద్ధి చేస్తానని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మి నరసింహ స్వామి సాక్షిగా పంద్రాగస్టు లోపుల రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి
Hyderabad: రూ.40 వేలేనా.. ఇంకేం లేదా?!
Jaggareddy: శ్రీరామచంద్రుని నిజమైన వారసుడు రాహుల్ గాంధీయే..
MLA Vivekananda: రేవంత్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 21 , 2024 | 10:11 PM