ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Election 2024: కేసీఆర్ మోసగాడు.. నన్ను జైల్లో పెట్టించాడు: మందకృష్ణ మాదిగ

ABN, Publish Date - May 10 , 2024 | 05:58 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు.

Manda Krishna Madiga

ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) మోసగాడని.. తమను నిలువునా మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga) అన్నారు. కేసీఆర్‌కి మనం అండగా నిల్చున్న రోజులు చాలా ఉన్నాయని.. ఆయన మనల్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన మాట తప్పాడనీ ప్రశ్నిస్తే తనను జైల్లో పెట్టించారని విరుచుకుపడ్డారు. రెండు సార్లు నెల రోజుల పాటు తనను కేసీఆర్ జైల్లో పెట్టించారని ధ్వజమత్తారు.కేసీఆర్ తన పని అయిపోయిందని శాసన సభలో అహంకారంతో మాట్లాడాడని అన్నారు.


AP Election 2024 : విజన్ X విధ్వంసం.. చంద్రబాబు, జగన్‌కు తేడా ఇదే

కేసీఆర్ చివరకు మాదిగలను ఎంతలా అవమానించాడంటే తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద కులం మాదిగలకు ఒక్క మంత్రి పదవీ ఇవ్వలేదని అన్నారు. శుక్రవారం మాదిగ కులస్తుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో మందకృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ ఒక కులం నుంచి 7 మంత్రి పదవులు ఇచ్చాడని, తన కులం వాళ్లకు 4 మంత్రి పదవులు.. మరి మాదిగలకు పదవులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఆయన దగ్గర 10 మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక్కరికీ ఎందుకు మంత్రి పదవీ ఇవ్వలేదని నిలదీశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ నుంచి ఒక్క మాదిగ ఎమ్మెల్యేగా గెలుపొందితే ఆయన్ను మంత్రిని చేశారని తెలిపారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో నష్టపోయినం, మోస పోయామని మందకృష్ణ మాదిగ విరుచుకుపడ్డారు.


Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

మాదిగలకు టికెట్లు ఇవ్వని రేవంత్ రెడ్డి

‘‘మరో మూడు రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఖమ్మం బీజేపీ అభ్యర్థిగా నిలబడిన నా సోదరుడు తాండ్ర వినోద్ రావును గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. మీరు ఏ పార్టీ అయినా తాండ్ర వినోద్ రావుకు ఓటు వేసి ఎంపీగా గెలిపించాలి. జాతి భవిష్యత్ బాగుపడాలి అంటే బీజేపీకి ఓటు వేయాలి. మనం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబునీ నమ్ముకున్నాం, చంద్రబాబు హయంలోనే మనకు న్యాయం జరిగింది. టీడీపీ, బీజేపీ గురించి మాట్లాడుతున్న అంటే నేను ఏమి ఆ పార్టీకి చెందిన వాడిని కాదు. ఎస్సీ వర్గీకరణ కోసం చంద్రబాబు నాయుడు సహకరించారు, దాని వర్గీకరణ నరేంద్ర మోదీ చేస్తారు. చంద్రబాబును 26 ఏళ్ల క్రితం మన మీటింగ్‌కి రప్పించాం. ఇప్పుడు నేను టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థి విజయం కోసం వెళ్లి వస్తున్నాను. చంద్రబాబుకి ఇప్పుడు కాదు ఆయనను నమ్ముకున్నందుకు గతంలోనే మద్దతు ఇచ్చా.చంద్రబాబుకి ఎందుకు రుణపడి ఉన్నాం అంటే 22 వేల ఉద్యోగాలు మన బిడ్డలకు చంద్రబాబు హయాంలో వచ్చాయి. మాదిగ బిడ్డల భవిష్యత్తును కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదు, అందుకే వాళ్లకు మనం ఓటు వేయొద్దు. ఏ నాడూ లేని అవమానం రేవంత్ రెడ్డి హయాంలో జరిగింది. రేవంత్ రెడ్డి ఎదుగుదలకు మాదిగలే కారణం అని స్వయానా ఆయనే ఒప్పుకున్నాడు. మాదిగల రుణం తీసుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదా, ఆయన న్యాయం చేయకపోగా అన్యాయం చేశాడు. మాదిగలకు మూడు లోక్ సభ స్థానాలు ఉండగా రెండు స్థానాలు మాకు రావాలి, ఆయన ఇప్పించాలి కానీ దాన్ని పక్కకు పెట్టాడు. ఓకే ఇంట్లో ఉన్న వివేక్ కుటుంబంలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా ఎంపీ సీటు కూడా ఇప్పించాడు’’ అని మందకృష్ణ మాదిగ మండిపడ్డారు.


మోదీ మన జాతిని అక్కున చేర్చుకున్నారు

‘‘నాగర్ కర్నూల్ మల్లు రవికి సీటు ఇప్పించాడు, మల్లు రవి తమ్ముడు ఎవరు మల్లు భట్టి విక్రమార్క మనకు ఎందుకు ఇప్పించలేదు. కడియం శ్రీహరి ఎస్సీ కాదు అని రేవంత్ రెడ్డినే చెప్పిండు తిరిగి ఆయన కూతురికే సీటు ఇప్పించాడు. రాజ్యాంగం ప్రకారం మతం మారితే ఎస్సీ సర్టిఫికెట్ వర్తించదు కదా. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కూడా మాదిగలకు ఇవ్వకుండా మాలలకే ఇప్పించాడు. కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎందుకు ఓటు వేయాలి,మన కులానికి అన్యాయం చేసినందుకా. దేశ ప్రధాన మంత్రి కుల మీటింగ్‌లకు వస్తారా, ఆయన చెప్పారు ఒక డేట్ పెట్టుకో వస్తా అని చెప్పి మీటింగ్‌కి వచ్చి హామీ ఇచ్చాడు. మన జాతి వర్గీకరణ విషయంలో విజయం సాధిస్తే ఆ విజయానికి కారణం నరేంద్ర మోదీనే. మాదిగ అని తెలిస్తే ఎవరైనా దూరం పెడతారని అనుకున్న జాతి కానీ నరేంద్ర మోదీ మన జాతిని అక్కున చేర్చుకున్నారు, ఆయనకే ఈ ఎన్నికల్లో మన మద్దతు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు మద్దతు లేదు మాదిగ బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వర్గీకరణ విషయంలో ఏమి మాట్లాడలేకపోయి రిజర్వేషన్లు రద్దు చేస్తారని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు ఢోకా లేదు, రాజ్యాంగం రద్దు చేయడం జరగదు. ఆర్టికల్ 370 రద్దు చేసి అంబేద్కర్ రాజ్యాంగం దేశం మొత్తం అమలు చేసేలా నరేంద్ర మోదీ చేశారు. రెండు సార్లు రాష్ట్రపతిని చేసే అవకాశం వస్తే కాంగ్రెస్ ఉన్నత వర్గాలకు అవకాశం ఇచ్చింది, బీజేపీకి అవకాశం వస్తే మొదటి సారి దళితుడిని, రెండోసారి గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. మీ బిడ్డగా అందరికీ చెబుతున్న నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అయితేనే దేశం అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది’’ అని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.

Chintala Ramchandra Reddy: ఓటమి భయంతోనే బీజేపీపై దుష్ప్రచారం..

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 10 , 2024 | 05:59 PM

Advertising
Advertising