ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections 2024: రైతు రుణ మాఫీపై మంత్రి తుమ్మల కీలక ప్రకటన

ABN, Publish Date - Apr 23 , 2024 | 10:24 PM

అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: అర్హులైన పేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) అన్నారు. మంగళవారం నాడు పినపాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ చేయాలంటే అధిక భారం పడుతుందని.. కానీ ఎన్నికల అనంతరం ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతలపై భారం పడకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పంటకు ప్రతి ఎకరాకు ఇన్సూరెన్స్ కట్టి రైతులకు భరోసా కల్పిస్తామని మాటిచ్చారు.


Lok Sabha Election 2024: ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ అభ్యర్థులు వీళ్లే! కరీంనగర్, హైదరాబాద్ నుంచి ఎవరెవరంటే?

పామాయిల్ సాగుకు మన ప్రాంతం అనుకూలం, వరదలు వచ్చిన రైతులు నష్టపోరని వివరించారు. ప్రతి ఒక్క రైతు పామాయిల్ సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకరావడం కోసం ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని వివరించారు. అందరిని సమతుల్యంగా చూసేందుకు కాంగ్రెస్‌ని గెలిపించాలని ఇండియా కూటమిగా ఏర్పడిందని తెలిపారు. కరకగూడెంలో పులుసు బొంత ప్రాజెక్ట్‌ను తమ ప్రభుత్వం హయాంలో మొదలు పెడతామన్నారు. గోదావరి జలాలను తుమ్మలచెరువు ఆయకట్టుకు అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు.


Komatireddy: నీకు సుఖేందర్ చాలు... జగదీష్‌రెడ్డిపై కోమటిరెడ్డి సెటైర్

రాబోయే రోజుల్లో రూ. 21 వేల కోట్లతో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గోదావరి తీరంలో కట్టే సీతారామ , సీతమ్మ బ్యారేజ్ ప్రాజెక్టు పనులను అతి త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలని ఆకాక్షించారు. కాంగ్రెస్‌లో ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేసి పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ఓడించాలని అన్నారు. 10 ఏళ్లలో తెలంగాణను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భ్రష్టుపట్టించారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.


Breaking: కవితకు మరో బిగ్ షాక్.. ఇప్పట్లో కష్టమే!

Read Latest Telangana News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 10:50 PM

Advertising
Advertising