ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: కిక్కిరిసిన బస్టాండ్స్.. ప్రయాణికుల ఆగ్రహం.. క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్

ABN, Publish Date - May 11 , 2024 | 11:22 AM

Telangana: మే 13న పోలింగ్, వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది.

passenger Anger over Less busses

హైదరాబాద్, మే 11: మే 13న పోలింగ్ (Elections 2024), వరుసగా మూడు రోజులు సెలవులు. ఇంకేముంది ప్రజలంతా సొంతూళ్ల బాట పట్టారు. వీకెండ్‌తో పాటు సోమవారం పోలింగ్ నేపథ్యంలో తెలుగు ప్రజలు (Telgugu People) పల్లెలకు వెళ్లేందుకు పెద్ద సంఖ్యలో బస్టాండ్లకు చేరుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది వెళ్లిపోగా.. మరికొందరు ఈరోజు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఎంజీబీఎస్ వద్ద సొంతూళ్లకు ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్తున్న వారితో బస్టాండ్ కిక్కిరిసి పోయింది. అయితే ఆర్టీసీ (TSRTC)సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

AP Elections: పోలింగ్ ఏర్పాట్లపై కలెక్టర్ ఢిల్లీరావు ఏమన్నారంటే..


సూర్యాపేట, మహబూబ్ నగర్, ఖమ్మం, కోదాడ మార్గాల్లో సరిపడా బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లకు గురవుతున్నారు. నగరంలోని అన్ని బస్ స్టేషన్ల వద్ద ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. ఎంజీబీఎస్, జేబీఎస్, మియాపూర్, కేపీహెచ్‌బీ, కూకట్ పల్లి బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. వరసగా మూడు రోజుల సెలవులు, ఓటు వినియోగం నేపథ్యంలో నగర వాసులు సొంతుళ్ల బాటపట్టారు. స్పెషల్ బస్సులు టైంకి రాకపోవడంతో ప్రయాణికులు గంటలకొద్దీ పడిగాపులుకాస్తున్న పరిస్థితి.

Voter ID: మీకు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా.. ఇలా ఓటు వేయొచ్చు


ప్రైవేట్ ట్రావెల్స్... చార్జీల మోత

మరోవైపు ప్రైవేట్ ట్రావెల్స్‌లో చార్జీల మోత మోగుతోంది. ప్రైవేట్ ట్రావెల్స్ రద్దీని తమకు అనుకూలంగా మార్చుకుంటూ.. క్యాష్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఏపీ, బెంగళూరు వెళ్లే వారికి అదనపు చార్జీలతో బాదుతున్నారు. దాదాపు 50% టికెట్ రేట్లను ప్రైవేట్ ట్రావెల్స్ పెంచేశాయి. ఏసీ స్లీపర్ క్లాస్ బస్సులపై రూ.3 వేల వరకు చార్జీలను ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు పెంచేశారు.


ఇవి కూడా చదవండి...

Pawan Kalyan: ఎట్టకేలకు పర్మిషన్.. ద్వారంపూడి ఇలాకాలో పవన్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ

Nimmagadda Ramesh Kumar: ఈ సమయంలో ప్రతిపక్షాలను వేధిస్తే ఎలా?

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 11 , 2024 | 11:26 AM

Advertising
Advertising