ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Elections 2024: ఓటు వేసేందుకు సొంతూర్లకు ప్రజలు.. బస్టాండుల్లో రద్దీ అధికం

ABN, Publish Date - May 11 , 2024 | 10:05 AM

Telangana: భాగ్యనగరం ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది.

People go home to cast vote

హైదరాబాద్, మే 11: భాగ్యనగరం (Hyderabad) ఖాళీ అవుతోంది. ఓట్లు వేసేందుకు తెలుగు ప్రజలు తమ తమ సొంతూర్లకు తరలివెళ్తున్నారు. దీంతో హైదరాబాద్ నగరం సగానికి పైగా ఖాళీ అవుతున్న పరిస్థితి. సొంతూర్లకు వెళ్లేందుకు ప్రజలు బస్టాండ్లకు తరలివెళ్తున్నారు. దీంతో జేబీఎస్ బస్టాండ్ వద్ద విపరీతమైన రద్దీ నెలకొంది. శని, ఆదివారం, సోమవారం వరుసగా సెలవుల నేపథ్యంలో ప్రజలు తమ తమ గ్రామాలకు తరలివెళ్తు్న్నారు. దీంతో బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికులు కిక్కిరిసి పోయారు. అయితే సరిపడా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ జిల్లాల కోసం టీఎస్‌ ఆర్టీసీ సిటీ బస్సులను వినియోగిస్తోంది.

Pawan Kalyan: ఎట్టకేలకు పర్మిషన్.. ద్వారంపూడి ఇలాకాలో పవన్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ


మరోవైపు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఊర్లకు పయనమవుతుండటంతో ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులతో ఎంజీబీఎస్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు నిండిపోయారు. తెలుగు రాష్ట్రాలకు రెండు వేల ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ ఎంబీబీఎస్ నుంచి 500 ప్రత్యేక బస్సులు. జేబీఎస్ బస్టాండ్ నుంచి 200 స్పెషల్ బస్సులు, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే 58 ప్రత్యేక రైళ్ళను దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ఏర్పాట్లు చేసింది. ప్రయాణికుల రద్దీని బట్టి సర్వీసులు పెంచుతామని రైల్వే అధికారులు చెబుతున్నారు. అయితే ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రజలు అధికంగా పల్లెలకు తరలుతుండటంతో బస్సు సర్వీసులు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏర్పడింది.


ఇవి కూడా చదవండి...

Kodali Nani: ఏందయ్యా నానీ.. ఏంటీ వింత లీలలు!

Jagan : ‘బటన్‌’ కుట్రలు బద్దలు!

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 11 , 2024 | 10:26 AM

Advertising
Advertising