ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: బీజేపీ అధికారంలోకి వస్తే ఇక అంతే సంగతులు..!!

ABN, Publish Date - May 18 , 2024 | 08:13 AM

భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు.

kejriwal

ముంబై: భారతీయ జనతా పార్టీ (BJP) కేంద్రంలో మరోసారి అధికారంలోకి వస్తే ఏ ఒక్క నేతను వదిలిపెట్టదని ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఓకే దేశం, ఓకే నేత విధానంపై ప్రధాని మోదీ పనిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే బీజేపీకి ప్రజల ఆదరణ తగ్గిందని ఆయన వివరించారు. ఒకవేళ బీజేపీ తిరిగి అధికారం చేపడితే ముఖ్య నేతల అందరినీ జైలుకు పంపించడం ఖాయం అని స్పష్టం చేశారు. ముంబైలో జరిగిన ఇండియా బ్లాక్ ర్యాలీలో కేజ్రీవాల్ పాల్గొన్నారు.


జైలుకు వెళ్లేది వీరే..

శివసేన యూబీటీ నేత ఉద్దవ్ థాకరే, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఎన్సీపీ (శరద్ పవార్) అధినేత శరద్ పవార్ అందరినీ బీజేపీ ప్రభుత్వం జైలుకు పంపించనుందని అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పరిస్థితులు ఏ మాత్రం బాగోలేవని వివరించారు. రష్యాలో పుతిన్ ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో అరవింద్ కేజ్రీవాల్ ఉదహరించారు. ప్రతి పక్ష నేతలను చంపుతున్నారు.. లేదంటే జైలుకు పంపిస్తున్నారని వివరించారు. ప్రతిపక్ష పార్టీలు అనేవి లేకుండా చేస్తారని తెలిపారు.


పాక్, బంగ్లా మాదిరిగా

ఒకవేళ పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగితే ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లడం ఖాయమని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అతని పార్టీ ఇక ఉండదని వివరించారు. బంగ్లాదేశ్‌లో కూడా ఇలానే జరుగుతుందని పేర్కొన్నారు. అదే విధానాన్ని ప్రధాని మోదీ దేశంలో అవలంభిస్తారని ఆరోపించారు. భారత్‌ను మరో పాకిస్థాన్, బంగ్లాదేశ్ మాదిరిగా చేయాలని మోదీ అనుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.



For More
National News and Telugu News..

Updated Date - May 18 , 2024 | 08:17 AM

Advertising
Advertising